టీమిండియా ఓడేది ఆ జట్టు చేతిలోనే.. మెకల్లమ్ జోస్యం!

ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్‌కప్ 2019 మొదలైంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌లు కూడా పూర్తైయ్యాయి. అయితే అందరూ అనుకున్నట్లు ఏ ఒక్క మ్యాచ్ కూడా రసవత్తరంగా సాగలేదు. మరోవైపు అందరిని ఆశ్చర్యపరుస్తూ నిన్న జరిగిన సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో.. సఫారీ జట్టు అనూహ్యంగా ఓటమి చవి చూసింది. ఇది ఇలా ఉండగా ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుందని కివీస్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ జోస్యం చెప్పాడు.

భారత్ జట్టు కేవలం ఇంగ్లాండ్ చేతిలోనే ఓటమి పాలవుతుందని.. ఖచ్చితంగా సెమీస్‌కు చేరుతుందని మెకల్లమ్ తెలిపాడు. అటు లీగ్ మ్యాచుల్లో ఎవరెన్ని గెలుస్తారో కూడా అంచనా వేసిన బ్రెండన్ దానిపై ఓ లిస్ట్‌ను రెడీ చేసి తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో షేర్ చేశాడు. అతని అంచనాల ప్రకారమే తొలి రెండు రోజుల ఫలితాలు కూడా వచ్చాయి. అయితే నిన్న జరిగిన మ్యాచ్‌లో మాత్రమే అంచనా తప్పింది. సెమీస్‌కు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియాలు ఖచ్చితంగా వెళ్తాయని.. నాలుగో బెర్త్ కోసం టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపాడు. కాగా కొంతమంది నెటిజన్లు మెకల్లమ్ లిస్ట్‌పై ఫైర్ అవుతుంటే.. మరికొందరు అతనిని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం బ్రెండన్ రెడీ చేసిన ఈ లిస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *