పాడేరులో ఎన్టీఆర్.. ఆర్‌ఆర్‌ఆర్‌లో కీలక ఎపిసోడ్స్ ఇక్కడే..!

బాహుబలి వంటి బిగ్గెస్ట్ హిట్ తరువాత రాజమౌళి చేస్తోన్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో.. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లు హీరోలుగా నటిస్తోన్నారు. కాగా.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా.. విశాఖపట్టణంలోని పాడేరులో కీలక ఎపిసోడ్స్‌ని షూట్ చేయనుంది చిత్ర బృందం. ఈ ప్రత్యేకమైన షూటింగ్‌ కోసం ఈరోజు హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌కి చేరుకున్నాడు ఎన్టీఆర్. బుధవారం నుంచి.. పాడేరులో ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ జరగబోతోంది. కాగా.. వైజాగ్ […]

పాడేరులో ఎన్టీఆర్.. ఆర్‌ఆర్‌ఆర్‌లో కీలక ఎపిసోడ్స్ ఇక్కడే..!
Follow us

| Edited By:

Updated on: Dec 10, 2019 | 5:17 PM

బాహుబలి వంటి బిగ్గెస్ట్ హిట్ తరువాత రాజమౌళి చేస్తోన్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో.. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లు హీరోలుగా నటిస్తోన్నారు. కాగా.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా.. విశాఖపట్టణంలోని పాడేరులో కీలక ఎపిసోడ్స్‌ని షూట్ చేయనుంది చిత్ర బృందం.

ఈ ప్రత్యేకమైన షూటింగ్‌ కోసం ఈరోజు హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌కి చేరుకున్నాడు ఎన్టీఆర్. బుధవారం నుంచి.. పాడేరులో ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ జరగబోతోంది. కాగా.. వైజాగ్ ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ టీంకి.. అభిమానులు సాదర స్వాగతం పలికారు. అయితే.. ఈ చిత్రంలోని కీలక ఎపిసోడ్స్‌ని పాడేరులో చిత్రీకరించబోతున్నారని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. దాదాపు ఐదురోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరగనుంది. షూటింగ్ అనంతరం.. వీరు హైదరాబాద్‌కి చేరుకుంటారు.