సీసీటీవీ, మొబైల్ అలెర్ట్‌తో.. ‘పనస చెట్టుకు’ ఇంత సెక్యూరిటీనా..?

Karnataka: This rare jackfruit tree gets CCTV protection in Tumkur district, సీసీటీవీ, మొబైల్ అలెర్ట్‌తో.. ‘పనస చెట్టుకు’ ఇంత సెక్యూరిటీనా..?

ఏంటీ.. పనస చెట్టుకు ఇంత సెక్యూరిటీ ఏంటని షాక్ అవుతున్నారా..! నిజంగానే ఆ పనస చెట్టు చుట్టూ.. కరెంట్ ఫెన్సింగ్.. మొబైల్ అలెర్ట్ సిస్టమ్, సీసీటీవీ ఉన్నాయి. మరి ఆ పనసచెట్టు ఎందుకింత స్పెషలో తెలుసుకుందామా..! ఇంతగా సెక్యూరిటీ కల్పించడానికి ఆ చెట్టులో ఏముంది అనుకుంటున్నారా.. నిజంగానే ఆ చెట్టు చాలా స్పెషల్‌నే.

ఇలాంటి అరుదైన పనస చెట్టు దేశంలో ఎక్కడా లేదట. ఇది చాలా అరుదైన జాతికి చెందినది. ఇది కర్ణాటకలోని తుముకూరు జిల్లా గుబ్బి తాలూకాలోని ఓ మారుమూల గ్రామంలో ఉంది. ఆ ఇంటి యజమాని పేరు పరమేశు. ఆయన తండ్రి కొన్నేళ్ల క్రితం ఈ చెట్టును నాటారట. అదే పనస చెట్టు. ఇలాంటి చాలా ఉంటాయి కాదా అనుకోకండి.. ఇది వేరు. సాధారణంగా.. పనస చెట్టు తొనలు.. గోధుమ రంగులో కానీ.. పసుపు రంగులో కానీ ఉంటాయి. కానీ.. ఈ చెట్టుకి మాత్రం పనస తొనలు.. రాగి రంగులో ఉండటం విశేషం. దీనికి సంవత్సరానికి 500లకు పైగా పనస పండ్లు కాస్తాయి.

Karnataka: This rare jackfruit tree gets CCTV protection in Tumkur district, సీసీటీవీ, మొబైల్ అలెర్ట్‌తో.. ‘పనస చెట్టుకు’ ఇంత సెక్యూరిటీనా..?

తాజాగా.. ఈ చెట్టుకును గుర్తించిన శాస్త్రవేత్తలు.. పరమేశు ఇంటికి చేరుకుని.. వివరాలు తెలుసుకున్నారు. దీనిలో ఔషద గుణాలు ఉన్నాయని తెలుసుకున్న శాస్త్రవేత్తలు.. కొత్త వంగడాలను సృష్టించారు. వీటిని.. రైతులకు.. ప్రజలకు పంపిణీ చేశారు. అయితే.. తాజాగా.. కొన్ని రోజుల క్రితం పరమేష్ ఇంట్లో లేని సమయంలో.. కొందరు ఆకతాయిలు చెట్టు నుంచి కాయలను దొంగిలిచారు. దీంతో.. పరమేష్.. చెట్టుకు మొబైల్ అలెర్ట్ సిస్టమ్ పెట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *