హస్తినలో ‘ కర్నాటకం ‘..ఎన్నాళ్లీ నిరీక్షణం ?

కర్ణాటక రాజకీయ సంక్షోభం దాదాపు రెండు వారాలుగా రాష్ట్రాన్ని కుదిపివేస్తోంది. అసెంబ్లీలో సీఎం కుమారస్వామి బలపరీక్ష ఎటూ తేలకుండా వాయిదాల మీద వాయిదా పడుతోంది. రాత్రి వేళ సభలోనే ఎమ్మెల్యేలు నిద్రిస్తున్నారు. పగలంతా అసెంబ్లీ ఆవరణలోనే భోజనాదికాలు కానిచ్ఛేస్తున్నారు. రోజుకో హై డ్రామాని జనం చూడాల్సి వస్తోంది. తాజాగా.. కుమారస్వామి మెజారిటీ నిరూపణకు స్పీకర్ సోమవారానికి వాయిదా వేసినప్పటికీ.. ఆ రోజైనా బలపరీక్ష జరుగుతుందా అని బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికార పగ్గాలను […]

హస్తినలో ' కర్నాటకం '..ఎన్నాళ్లీ నిరీక్షణం ?
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 20, 2019 | 6:24 PM

కర్ణాటక రాజకీయ సంక్షోభం దాదాపు రెండు వారాలుగా రాష్ట్రాన్ని కుదిపివేస్తోంది. అసెంబ్లీలో సీఎం కుమారస్వామి బలపరీక్ష ఎటూ తేలకుండా వాయిదాల మీద వాయిదా పడుతోంది. రాత్రి వేళ సభలోనే ఎమ్మెల్యేలు నిద్రిస్తున్నారు. పగలంతా అసెంబ్లీ ఆవరణలోనే భోజనాదికాలు కానిచ్ఛేస్తున్నారు. రోజుకో హై డ్రామాని జనం చూడాల్సి వస్తోంది. తాజాగా.. కుమారస్వామి మెజారిటీ నిరూపణకు స్పీకర్ సోమవారానికి వాయిదా వేసినప్పటికీ.. ఆ రోజైనా బలపరీక్ష జరుగుతుందా అని బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికార పగ్గాలను చేబట్టడానికి చాప కింద నీరులా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు-ఢిల్లీలోని తాజ్ వివంట లో కాంగ్రెస్ నేతలు సమావేశమై.. తమ రెబల్ ఎమ్మెల్యేలను మళ్ళీ దారికి తెచ్చుకోవడానికి మంతనాలు సాగిస్తున్నారు. బీజేపీ వలలో పడకూడదంటూ వారిని బుజ్జగించడానికి నానా పాట్లూ పడుతున్నారు. సీఎం కుమారస్వామి, కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టుకెక్కి.. ఏకంగా గవర్నర్ వ్యవస్థనే ప్రశ్నించడం విశేషం. అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని, ఇది అనుచితమని వారు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. అసెంబ్లీ కార్యకలాపాల్లో రెబెల్ శాసన సభ్యులు పాల్గొనేలా తాము ఒత్తిడి తేజాలమని సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యంలో.. అసలు సభలో విశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు గవర్నర్ సభను ఎలా శాసిస్తారని కుమారస్వామి కోర్టును ప్రశ్నించారు. ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి చూస్తే.. మీ ప్రభుత్వం సభ విశ్వాసాన్ని పొందలేదని తెలుస్తోందని గవర్నర్ వాలా.. కుమారస్వామికి రాసిన రెండో లేఖలోనూ ప్రస్తావించడంతో కుమారస్వామి మండిపడుతున్నారు. బేరసారాలకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తనకు వార్తలందుతున్నాయని గవర్నర్ పేర్కొన్న అంశాన్ని ఆయన గుర్తు చేస్తూ.. ఇది తనకు గవర్నర్ నుంచి అందిన రెండో ‘ ప్రేమ లేఖ ‘ అని, చూడబోతే ఆయనకు ‘ జ్ఞానోదయం ‘ కలిగినట్టు ఉందని వ్యాఖ్యానించారు. రెబల్ ఎమ్మెల్యేలకు 40 కోట్ల నుంచి 50 కోట్లు ఇస్తామన్న ప్రలోభాలు చూపుతున్నారని, ఎవరి డబ్బు ఇదంతా అని ఆయన బీజేపీని ఉద్దేశించి ప్రశ్నించారు. శనివారం తన నివాసానికి చేరుకున్న జేడీ-ఎస్ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అయిదు కోట్ల ముడుపులు ఇస్తామని తనకు ఆశ పెట్టారని జేడీ-ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ ఆరోపించారు. ఇలాగే మరో ఎమ్మెల్యే కూడా ఆరోపణ చేశారు. ఇదిలా ఉండగా.. కుమారస్వామి ప్రభుత్వానికి సోమవారమే చివరి రోజని బీజేపీ నేత, మాజీ సీఎం ఎడ్యూరప్ప అంటున్నారు. వారికి సభలో మెజారిటీ లేదని, తాము 106 మందిమి ఉన్నాం కనుకే సభను వాయిదా వేస్తున్నారని ఆయనవిమర్శించారు. మరోవైపు-కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించే ప్రసక్తి లేదని కేంద్రం స్పష్టం చేసింది. తాము అన్ని పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, ‘ వెయిట్ ‘ చేస్తున్నామని హోమ్ మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు