కర్నాటక ఖాకీల మానవత.. ఏం చేశారంటే..?

ఆ పోలీసుల్లో మానవత్వం వెల్లివిరిసింది. దిక్కుమొక్కు లేక మరణించిన ఓ మానసిక వికలాంగుడి అంత్యక్రియలను వారే దగ్గరుండి నిర్వహించారు.  వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని చామరాజనగర్, మైసూర్ సరిహద్దుల్లో ఉందో గ్రామం. ఆ గ్రామానికి ఆనుకునే అడవులు కూడా ఉన్నాయి. ఇటీవల ఆ గ్రామంలోని సుమారు 44 ఏళ్ళ మానసిక దుర్బలుడిని ఓ అడవి ఏనుగు తొక్కి చంపివేసింది. అయితే అతనికి కరోనావ్యాధి కూడా సోకి ఉండవచ్చునని భావించిన అతని కుటుంబ సభ్యులు కనీసం ఆ మృత దేహం […]

కర్నాటక ఖాకీల మానవత.. ఏం చేశారంటే..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 09, 2020 | 4:30 PM

ఆ పోలీసుల్లో మానవత్వం వెల్లివిరిసింది. దిక్కుమొక్కు లేక మరణించిన ఓ మానసిక వికలాంగుడి అంత్యక్రియలను వారే దగ్గరుండి నిర్వహించారు.  వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని చామరాజనగర్, మైసూర్ సరిహద్దుల్లో ఉందో గ్రామం. ఆ గ్రామానికి ఆనుకునే అడవులు కూడా ఉన్నాయి. ఇటీవల ఆ గ్రామంలోని సుమారు 44 ఏళ్ళ మానసిక దుర్బలుడిని ఓ అడవి ఏనుగు తొక్కి చంపివేసింది. అయితే అతనికి కరోనావ్యాధి కూడా సోకి ఉండవచ్చునని భావించిన అతని కుటుంబ సభ్యులు కనీసం ఆ మృత దేహం వద్దకు కూడా రాలేదు. ఆ డెడ్ బాడీని తీసుకువెళ్లేందుకు నిరాకరించారు. దీంతో ఆ వ్యక్తికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహింఛాలని  అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ మాదె గౌడ, మరో ఇద్దరు పోలీసులు నిర్ణయించుకున్నారు. వారే ఎర్త్ మూవర్ తో సమాధి తవ్వి అందులో ఆ వ్యక్తి  మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. అనంతరం ఆ సమాధివద్ద మాదెగౌడ ప్రార్థనలు కూడా చేశారు. ఈ వ్యక్తికి కరోనా ఉందో, లేదో తమకు తెలియదని, కానీ ఈ పని చేసినందుకు తమకు తృప్తిగా ఉందని అంటున్నారు ఆ పోలీసన్నలు.