ఆ 60 మందితో పాటు.. కేంద్రానికి మద్దతుగా బాలీవుడ్ నటి

Kangana Ranaut 60 Others Hit Back After Open Letter To PM, ఆ 60 మందితో పాటు.. కేంద్రానికి మద్దతుగా బాలీవుడ్ నటి

మైనార్టీలు, దళితులపై జరుగుతున్న మూకదాడులపై ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని కోరుతూ.. 49 మంది ప్రముఖులు జూలై 23న బహిరంగ లేఖ రాశారు. కాగా, ఈ లేఖకు వ్యతిరేకంగా వివిధ రంగాలకు చెందిన 61 మంది ప్రముఖులు మరో బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో సంతకాలు చేసిన వారిలో ప్రముఖ నటి కంగనా రనౌత్, గీత రచయిత ప్రసూన్ జోషి, శాస్త్రీయ నృత్యకళాకారిణి, ఎంపీ సోనల్ మనసింగ్, సినీ దర్శకుడు మధుర్ భండార్కర్‌తో పాటు తదితరులు కూడా ఉన్నారు. నక్సల్స్‌ దాడిలో అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోయినప్పుడు, కశ్మీర్‌లో తీవ్రవాదులు స్కూళ్లను తగలబెట్టినప్పుడు, దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినాదాలు చేసినప్పుడు వీళ్లెందుకు మౌనంగా ఉన్నారని పలువురు ప్రశ్నించారు. ఇదే విషయం పై మాట్లాడుతూ.. ప్రజలను కొంతమంది ప్రముఖులు తప్పుదోవ పట్టిస్తున్నారని కంగనా రనౌత్ విమర్శించారు. మోదీ ప్రభుత్వంలో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయని ఆమె చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *