ఐఏఎస్ మాజీ టాపర్‌ హౌస్ అరెస్ట్

Jammu Kashmir Leader Shah Faesal stopped

కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్ కొనసాగుతోంది. సున్నితమైన ప్రాంతాల్లో నిషేధాఙ్ఞలు కొనసాగుతున్నాయి. మరోవైపు శాంతి భద్రతల దృష్ట్యా కశ్మీర్‌కు చెందిన దాదాపు 400మంది రాజకీయ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో విదేశాలకు వెళ్తున్న ఐఏఎస్ మాజీ టాపర్ షా ఫజల్‌ను ఢిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని శ్రీనగర్‌కు తరలించి గృహ నిర్బంధం చేశారు.

అయితే 2009లో ఐఏఎస్ టాపర్ అయిన షా ఈ జనవరిలో తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. జమ్ముకశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్ అనే రాజకీయ పార్టీని స్థాపించి ఆయన పోరాడుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేయడంపై ఆయన విమర్శలు చేశారు. కశ్మీర్‌లో రాజకీయ హక్కులను పునరుద్ధరించేందుకు ఓ స్థిరమైన, సుదీర్ఘమైన, అహింసతో కూడిన రాజకీయ ఉద్యమం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్టికల్ 370రద్దుతో ప్రధానమైన రాజకీయ నాయకులు కరువయ్యారు. రాజకీయవాదులు వెళ్లిపోయారు. ఇప్పుడు ఒకరి కింద బతకాలి లేదా ప్రత్యేకంగా ఉండాలి అని ఫైజల్ ట్వీట్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *