Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

చెల్లితో టిక్‌టాక్‌ వీడియో చేశాడని.. నడిరోడ్డుపై బెల్ట్‌తో కొడుతూ.. నగ్నంగా ఊరేగించి..

Jaipur youth paraded naked for making TikTok video with girl, చెల్లితో టిక్‌టాక్‌ వీడియో చేశాడని.. నడిరోడ్డుపై బెల్ట్‌తో కొడుతూ.. నగ్నంగా ఊరేగించి..

టిక్‌టాక్.. ఇప్పుడు ఇది ఇండియాలో ట్రెండింగ్‌లో ఉన్న సోషల్ మీడియా యాప్. దీని ద్వారా షార్ట్ క్లిప్స్ వీడియోలు తీసి.. అప్‌లోడ్ చేస్తూ అన్ని వయస్సుల వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా యువతీయువకులైతే.. ఈ టిక్‌టాక్‌లో వినూత్న రీతిలో టిక్‌టాక్‌ వీడియోలను చేస్తూ.. లైక్స్ పొందుతూ ఆనందపడుతుంటారు. అయితే గతకొద్ది రోజులుగా ఈ వీడియోలు తీసే క్రమంలో కొందరు హద్దులు దాటుతూ.. వివాదాస్పదంగా కూడా తీస్తూ.. లేనిపోని ఇబ్బందులను కొనితెచ్చుకుంటున్నారు.

తాజగా రాజస్ధాన్‌లో జరిగిన ఘటన చూస్తే.. ఇక టిక్‌టాక్ చేసే వారు ఖంగుతినాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. తన స్నేహితురాలితో ఓ మైనర్‌ రొమాంటిక్‌గా టిక్‌టాక్‌ వీడియో చేశాడు. అయితే సదరు వీడియోను ఆ బాలిక సోదరుడు చూశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై.. సదరు బాలుడిని పట్టుకుని బెల్టు తీసుకుని చితకబాదాడు. అయితే అంతటితో ఆగకుండా.. ఆ బాలుడి బట్టలు విప్పించి.. నగ్నంగా ఊరేగించారు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారడంతో.. సదరు బాలుడి కుటుంబం అవమానంగా భావించింది. వెంటనే ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు బాలిక కుటుంబ సభ్యులు కూడా సదరు అబ్బాయిపై పోలీసుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. ఈ ఘటన ఈ నెల 7వ తేదీన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Related Tags