మహేష్ మూవీ నుంచి జగ్గు భాయ్ ఔట్..?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కశ్మీర్‌లో జరుగుతోంది. ఇక ఈ మూవీలో మహేష్ సరసన రష్మిక నటిస్తోండగా.. విజయశాంతి, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలలో కనిపించనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుంచి జగపతి బాబు ఔట్ అయినట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో ప్రకాష్ రాజ్‌ను తీసుకున్నారని సమాచారం. కారణాలు తెలీవు కానీ ఈ మూవీ నుంచి జగపతి బాబు తప్పుకున్నారట.

అయితే మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు, మహర్షి చిత్రాల్లో జగపతిబాబు కీలక పాత్రలలో నటించగా.. ఆ రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, మహేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *