Breaking News
  • హైదరాబాద్: జర్నలిస్టులందరికీ హెల్త్‌ కార్డులు అందించాలి, అన్ని ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈనెల 20 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు టీయూడబ్ల్యూజే వినతి పత్రాలు-టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ.
  • ఆసియాలోనే లైఫ్‌ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ మారింది. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌ సరఫరా చేస్తోంది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో హైదరాబాద్‌ వాటా 35శాతం-మంత్రి కేటీఆర్‌.
  • యాదాద్రి: గుండాల మండలం సుద్దాల దగ్గర ప్రమాదం, కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు.
  • విజయవాడ: ఎమ్మార్వో వనజాక్షిపై టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు, తమను కులం పేరుతో దూషించిందని ఫిర్యాదు చేసిన మహిళా రైతులు.
  • మహబూబాబాద్: పోడు భూముల ఆక్రమణదారులకు కలెక్టర్‌ హెచ్చరిక. 10 ఎకరాలకు మించి పోడు భూములు ఆక్రమించిన 119 మంది. ఆక్రమణదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు, కుల సంఘాల నేతలు. భూములు వెంటనే తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆదేశం. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.
  • ప్రాణం తీసిన సెల్ఫీ. కృష్ణాజిల్లా: నూజివీడులో విషాదం. సూరంపల్లి కాలువ దగ్గర సెల్ఫీ దిగేందుకు యువకుడు యత్నం. ప్రమాదవశాత్తు కాలువలో పడి యువకుడు మృతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పవన్‌.

బ్రేకింగ్: హైదరాబాద్‌లో ఇస్రో సైంటిస్ట్ హత్య

Isro scientist murder in Hyderabad, బ్రేకింగ్: హైదరాబాద్‌లో ఇస్రో సైంటిస్ట్ హత్య

హైదరాబాద్‌లో ఎస్సార్ నగర్‌‌లో ఇస్రో సైంటిస్ట్‌ హత్యకు గురయ్యారు. స్ధానిక ధర్మకరణ్ రోడ్డులో ఉన్న అన్నపూర్ణ అపార్ట్‌మెంట్ 2వ అంతస్తులో సైంటిస్ట్ సురేశ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ ఇంచార్జ్ సుమతి ఘటనాస్ధలానికి చేరుకుని.. హత్యకు గల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సురేశ్ ఇస్రోలో సైంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నట్టు స్ధానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.