చెన్నై జట్టు ఓటములకు కారణాలివే..!

|

Oct 20, 2020 | 2:00 PM

ఐపీఎల్ చరిత్రలో ఛాంపియన్ జట్టు.. ఎనిమిది సార్లు ఫైనల్స్.. మూడుసార్లు టైటిల్ గెలిచింది.. ఇంతటి ఘనమైన రికార్డు ఉన్న చెన్నై ఈ ఏడాది లీగ్‌ స్టేజిలోనే టోర్నీ..

చెన్నై జట్టు ఓటములకు కారణాలివే..!
Follow us on

IPL 2020: ఐపీఎల్ చరిత్రలో ఛాంపియన్ జట్టు.. ప్రతీసారి ప్లేఆఫ్స్‌కు చేరింది.. ఎనిమిది సార్లు ఫైనల్స్.. మూడుసార్లు టైటిల్ గెలిచింది.. ఇంతటి ఘనమైన రికార్డు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది లీగ్‌ స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రతీ ఐపీఎల్‌ సీజన్‌లోనూ లీగ్ స్టేజిలోనే క్రికెట్ విశ్లేషకులు చెన్నైకు ఫైనల్ బెర్త్ ఖరారు చేసేవారు. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎన్నో అంచనాల మధ్య ఈ ఏడాది ఐపీఎల్‌లో బరిలోకి దిగిన సీఎస్కే.. ప్లాప్ షో కొనసాగిస్తే.. ఇప్పటిదాకా ఆడిన పది మ్యాచుల్లో కేవలం మూడింటిలోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. సీఎస్కే ప్లేఆఫ్ ఛాన్సులు పూర్తిగా లేవు. కేవలం మిగతా జట్ల ప్రదర్శన మీద ఆధారపడాల్సిందే.

ఇదిలా ఉంటే సీఎస్‌కే ఓటములకు ప్రధాన కారణాలలో ఒకటి సురేష్ రైనా, హర్భజన్ సింగ్ జట్టుకు దూరం కావడం అయితే.. మరొకటి తలా ధోని ఫామ్‌లో లేకపోవడం అని చెప్పాలి. అలాగే బ్రావో కూడా లేకపోవడం.. చెన్నైకు పెద్ద మైనస్.. వీరు ఉన్నప్పుడు చెన్నై ప్రదర్శన మరీ ఇంత చెత్తగా లేదనే చెప్పాలి. అటు రైనా స్థానంలో సరైన ఆటగాడిని ఎంచుకోవడంలో చెన్నై ఫ్రాంచైజీ పూర్తిగా విఫలమైంది. కీలక సమయంలో బ్రావో గాయం కారణంగా జట్టుకు దూరం కావడం.. గత సీజన్ పర్పుల్ క్యాప్ విన్నర్ తాహీర్‌కు ఒక్క మ్యాచ్‌లో అవకాశం ఇవ్వకపోవడం.. ఇలా చెన్నైఓటములకు లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయి.

చెన్నై ఓటముల వెనుక కారణాలు ఇలా ఉన్నాయి

  • ఫామ్‌లో లేకపోయినా కేదార్ జాదవ్‌ను ఆల్‌రౌండర్‌గా కంటిన్యూ చేయడం..
  • టీఎన్‌పీఎల్‌లో మంచి రికార్డున్న జగదీశన్‌కు సరిగ్గా అవకాశాలు ఇవ్వకపోవడం..
  • జడేజా బ్యాటింగ్‌ను వినియోగించకపోవడం.. యువ ఆటగాళ్లకు ఛాన్సులు ఇవ్వకపోవడం..
  • లక్ష్యాన్ని చేధించడానికి సరైన ఫినిషర్ లేకపోవడం…
  • టెస్ట్ టైప్ బ్యాటింగ్ చేయడం..
  • విదేశీ ఆటగాళ్లను సరిగ్గా వినియోగించుకోకపోవడం..