గవాస్కర్ అనుచిత వ్యాఖ్యలు.. అనుష్క ఘాటు సమాధానం

ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ వైఫల్యంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే

  • Tv9 Telugu
  • Publish Date - 4:23 pm, Fri, 25 September 20
గవాస్కర్ అనుచిత వ్యాఖ్యలు.. అనుష్క ఘాటు సమాధానం

Anushka reply Gavaskar: ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ వైఫల్యంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అనుష్క శర్మని లాగుతూ గవాస్కర్‌ ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు. వీటిపై అనుష్క ఘాటు సమాధానం ఇచ్చారు. గవాస్కర్‌ మీ మెసేజ్‌ అగౌరపరిచేలా ఉందని, భర్త ఆటకు భార్యపై ఆరోపణలు చేస్తారా..? అంటూ అనుష్క ప్రశ్నించారు.

”చాలా ఏళ్లుగా క్రికెట్‌ ఆడి, కామెంటర్‌గా పనిచేసిన మీరు.. మిగిలిన క్రికెటర్ల వ్యక్తిగత విషయాల గురించి తప్పుగా మాట్లాడలేదనుకుంటున్నా. మరి అదే గౌరవం నా మీద, మా మీద ఎందుకు చూపడం లేదు. నా భర్త ఆటతీరు గురించి మాట్లాడటానికి మీ మనసులో మరెన్నో పదాలు ఉంటాయనుకుంటున్నా. ఇది 2020. కానీ నా విషయంలో మాత్రం ఇప్పటికీ ఏం మారలేదు. ఎప్పుడు నన్ను క్రికెట్‌లోకి లాగడం మానేస్తారు.? నా మీద ఆరోపణలు చేయడం మానేస్తారు..? గవాస్కర్ గారు జంటిల్‌మన్ గేమ్‌లో మీరు లెజండ్ అని నాకు తెలుసు. కానీ మీ మాటలు నన్ను బాధించాయి. అందుకే చెబుతున్నా” అని అనుష్క సమాధానం ఇచ్చారు. అయితే కోహ్లీ విఫలమైనప్పుడు అందులోకి అనుష్కను లాగడం కొత్తేం కాదు. వీరిద్దరు ప్రేమలో ఉన్న సమయం నుంచి కోహ్లీ విఫలమైనప్పుడు పలుమార్లు అనుష్కను లాగిన విషయం తెలిసిందే.

Read More:

మళ్లీ టాలీవుడ్‌కి సెన్సేషనల్‌ దర్శకుడు.. చెర్రీ కోసం కథ రెడీ చేస్తున్నాడా..!

Bigg Boss 4: ఇవాళ ‘బిగ్‌’ ట్విస్ట్‌