డివిలియర్స్ చితక్కొట్టుడు.. బెంగళూరు సూపర్ విక్టరీ..

సూపర్ మ్యాన్ ఏబీ డివిలియర్స్ చితక్కొట్టుడుతో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు అద్భుత విజయాన్ని సాధించింది.

డివిలియర్స్ చితక్కొట్టుడు.. బెంగళూరు సూపర్ విక్టరీ..
Follow us

|

Updated on: Oct 17, 2020 | 7:52 PM

IPL 2020: సూపర్ మ్యాన్ ఏబీ డివిలియర్స్ దంచి కొట్టుడుతో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు అద్భుత విజయాన్ని సాధించింది. ఓపెనర్ పడిక్కల్(35), కెప్టెన్ విరాట్ కోహ్లీ(43) రాణించడంతో పాటు లాస్ట్‌లో డివిలియర్స్ సూపర్ ఇన్నింగ్స్‌కు ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఒక దశలో బెంగళూరు చివరి మూడు ఓవర్లలో 45 పరుగులు చేయాల్సి ఉంది. అప్పుడు మిస్టర్ 360 అద్భుతం చేశాడు. హ్యాట్రిక్ సిక్సర్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. లీగ్‌లో బెంగళూరుకు ఆరో విజయాన్ని నమోదు చేశాడు.

అంతకముందు రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్‌గా ఉతప్ప(41) రాణించడం, స్మిత్(57) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టడం.. బట్లర్(24), తేవాటియా(19) హ్యాండీ క్యామియోలకు రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. బెంగళూరు బౌలర్లలో మోరిస్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. చాహాల్ రెండు వికెట్లు తీశాడు.