పొలార్డ్‌కు ఫైన్ పడింది

హైదరాబాద్‌ : ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌కు జరిమానా పడింది. ఐపీఎల్‌  కోడ్ ఆఫ్ కండక్ట్  కింద అతనికి ఈ జరిమానా విధించినట్లు ఐపీఎల్‌ బోర్డు తెలిపింది. 19 ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన డ్వేన్‌ బ్రావో రెండో బంతిని వైడ్‌గా వేశాడు. ఆ బంతిని అంపైర్‌ నితిన్‌ మేనన్‌ వైడ్‌గా ప్రకటిస్తాడని పొలార్డ్‌ భావించాడు. కానీ,  వైడ్‌ ఇవ్వకపోవడంతో అసహనానికి గురైన పొలార్డ్‌ బ్యాట్‌ను గాల్లోకి విసరేశాడు. ఆ తర్వాత బంతి వేసేందుకు బ్రావో పరుగెత్తున్న సమయంలో […]

పొలార్డ్‌కు ఫైన్ పడింది
Follow us

|

Updated on: May 13, 2019 | 3:10 PM

హైదరాబాద్‌ : ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌కు జరిమానా పడింది. ఐపీఎల్‌  కోడ్ ఆఫ్ కండక్ట్  కింద అతనికి ఈ జరిమానా విధించినట్లు ఐపీఎల్‌ బోర్డు తెలిపింది. 19 ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన డ్వేన్‌ బ్రావో రెండో బంతిని వైడ్‌గా వేశాడు. ఆ బంతిని అంపైర్‌ నితిన్‌ మేనన్‌ వైడ్‌గా ప్రకటిస్తాడని పొలార్డ్‌ భావించాడు. కానీ,  వైడ్‌ ఇవ్వకపోవడంతో అసహనానికి గురైన పొలార్డ్‌ బ్యాట్‌ను గాల్లోకి విసరేశాడు. ఆ తర్వాత బంతి వేసేందుకు బ్రావో పరుగెత్తున్న సమయంలో క్రీజులో ఉన్న పొలార్డ్‌.. అంపైర్‌ నిర్ణయాన్ని అవహేళన చేసేలా.. వైడ్‌ లైన్‌ను దాటి నడుస్తూ వెళ్లిపోయాడు. దీంతో ఐపీఎల్‌ నియమావళి ఉల్లంఘన కింద పొలార్డ్‌కు మ్యాచ్‌ ఫీజులో 25శాతం కోత పడింది. ఈ మ్యాచ్‌ పొలార్డ్ 25 బంతుల్లోనే 41 పరుగులు చేసి ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు.