Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 45 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 145380. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 80722. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 60491. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4167. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • దేశంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలస కార్మికుల దుస్థితిని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు. కేంద్రానికి,రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు. వలస కూలీల కష్టాలను తీర్చడానికి తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలని కోరిన ధర్మాసనం. మే 28 కి విచారించనున్న సుప్రీంకోర్టు. కేంద్రం ,రాష్ట్ర ప్రభుత్వాలలో కొన్నీ లోపాలు ఉన్నాయని కోర్టు వెల్లడి. వలస కూలీలకు ప్రయాణం, ఆశ్రయం, ఆహారాన్ని అందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ.
  • ఈ రోజు ఒకరికి CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 369 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ 141 యాక్టీవ్ కేస్ లు. 226 మంది డిశ్చార్జ్. ఇద్దరు మృతి.
  • లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు చేయుత. మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో 14 వేల మంది సినీ కార్మికులకు, టెలివిజన్ కార్మికులకు సొంత ట్రస్ట్ ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీకి శ్రీకారం.
  • అమరావతి: అధికార వికేంద్రీకరణ బిల్లు పరిశీలనకు మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీ వేయాలని ఆదేశించిన అమలు కావడం లేదని హైకోర్టులో పిటిషన్ వేసిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. 8 మంది సభ్యులతో కమిటీ వేయాలని మండలి చైర్మన్ ఆదేశించినా మండలి కార్యదర్శి అమలు చేయడం లేదని పిటిషన్ లో తెలిపిన దీపక్ రెడ్డి. నేడు విచారణ జరపనున్న హైకోర్టు.
  • హైకోర్టు జడ్జీలను కించపరుస్తూ పెట్టిన పోస్టులను హైకోర్టు సుమోటోగా స్వీకరించటంపై హర్షం వ్యక్తంచేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ప్రభుత్వం చేస్తున్న తప్పులను హైకోర్టు అడ్డుకుంటే ప్రజా ప్రతినిధులయ్యుండి సిగ్గులేకుండా హైకోర్టు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? హైకోర్టు జడ్జిలపై పోస్టులను హైకోర్టు సుమోటోగా స్వీకరించి 49 మందికి నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తొట్టిగ్యాంగ్ ను ప్రోత్సహించటం సరికాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కేసులు పెడుతున్న ప్రభుత్వం హైకోర్టు జడ్జిలపై పోస్టులు పెట్టే వారిని ఎందుకు కాపాడుతున్నది? పోస్టులు పెట్టిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలి - రామకృష్ణ.

2019 రివైండ్ న్యూస్.. అంతర్జాతీయ పరిణామాలు

inernational main events in 2019, 2019 రివైండ్ న్యూస్.. అంతర్జాతీయ పరిణామాలు

కాలగర్భంలో కలిసిపోతున్న 2019 సంవత్సరం.. మరో 48 గంటల్లో ఇక ఇది గత సంవత్సరమవుతుంది. నూతనంగా రాబోతోంది 2020..సరికొత్త సంఘటనల సమాహారంతో, నూతన పరిణామాలతో రానున్న ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. పాత వత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. ఒక్కసారి నిరుటి ప్రపంచ ప్రధాన వార్తల్లోకి వెళ్తే..వాటిలో కొన్ని…

*  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన..
* చైనా ఆధిపత్యాన్ని నిరసిస్తూ హాంకాంగ్ లో సుదీర్ఘకాలం సాగిన హింసాత్మక ఆందోళనలు
* బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎన్నిక.. అనేకమంది ప్రవాస భారతీయుల విజయ దుందుభి
* అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్
* ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ‘ నోటిదురుసు ‘
* అణు నిరాయుధీకరణపై అమెరికా- నార్త్ కొరియా మధ్య నిలిచిపోయిన చర్చలు
* అమెరికాకు కిమ్ పరోక్ష హెచ్చరిక.. ఖండాంతర  క్షిపణిని ప్రయోగిస్తామని వార్నింగ్, యుఎస్ కు డెడ్ లైన్

ట్రంప్ అభిశంసన కొలిక్కి వచ్ఛేనా ? జనవరిలో ఏం జరుగుతుంది ?

గత సంవత్సరం అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన వ్యవహారం అంతర్జాతీయ ప్రధాన ఘట్టాల్లో ఒకటి.. వచ్ఛే ఏడాది నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తున్న ట్రంప్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఎలాగైనా తనకు పోటీ లేకుండా చూసుకునేందుకు , తనకు ప్రత్యర్థిగా బరిలో నిలుస్తున్న డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ను ఓడించేందుకు ఇప్పటి నుంచే ఆయన వ్యూహాలు రూపొందించడం ప్రారంభించారు. అందులో భాగంగా జో బిడెన్, ఆయన కుమారుని అవినీతిపై విచారణ జరిపించాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఆయన ‘ దొంగచాటుగా ‘ ఫోన్ చేసిన వైనం రచ్ఛకెక్కింది. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ వ్యవహారాన్ని డెమొక్రాట్ల చెవిన వేయడంతో ట్రంప్ అభిశంసనకు పునాది పడింది. ప్రతినిధుల సభలో స్పీకర్ పెలోసీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్రంప్ అభిశంసకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ అంశంపై విచారణకు రెండు అత్యున్నత కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. విచారణ దశలవారీగా కొనసాగుతూ వచ్చింది. సభలో ఇటీవలే దీనిపై ఓటింగ్ జరగ్గా అభిశంసనకు అనుకూలంగా రెండువందలకు పైగా ఓట్లు పడ్డాయి. ప్రతికూలంగా సుమారు 180 ఓట్లు పడినప్పటికీ.. ట్రంప్ బెదరలేదు. రిపబ్లికన్లు అధిక సంఖ్యలో ఉన్న సెనేట్ లో తనకు ‘ న్యాయం ‘ జరుగుతుందని, అభిశంసన తీర్మానం వీగిపోతుందన్న కొండంత నమ్మకంతో ఉన్నారు ట్రంప్ గారు. వచ్ఛే జనవరిలో సెనేట్ లో దీనిపై ఓటింగ్ జరగనుంది.

బ్రిటన్ ఎన్నికల్లో మళ్ళీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎన్నిక.. ఎన్నారైల హవా

ఈ ఏడాది ఆఖర్లో జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని బోరిస్ జాన్సన్ అత్యధిక మెజారిటీతో గెలిచారు.. దాదాపు 80 కి పైగా సీట్లతో ఆయన ఆధ్వర్యంలోని కన్సర్వేటివ్ పార్టీ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంది. పైగా కీలకమైన బ్రెగ్జిట్ డీల్ విషయంలో జాన్సన్ పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకోగలిగారు . దీంతో జనవరి 31లోగా బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగనుంది. అలాగే ఈ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు విజయం సాధించడం విశేషం. వీరిలో చాలామంది బోరిస్ మంత్రివర్గంలో పదవులు పొందనున్నారు. వచ్ఛే ఫిబ్రవరిలో జాన్సన్ తన భారీ కేబినెట్ ను ఏర్పాటు చేయనున్నారు కూడా.. ఎన్నికల్లో ఆయన ఘన విజయాన్ని అభినందించిన ట్రంప్.. ఈ సెలబ్రేషన్స్ ని తమ అమెరికా దేశంలో జరుపుకోవాలని ఆహ్వానించారు. అయితే ఆయన అభిశంసన వ్యవహారం మరీ ‘ తీవ్రమైనదిగా ‘ ఉండడంతో.. బోరిస్ జాన్సన్ సున్నితంగా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు.

హాంకాంగ్ లో సుదీర్ఘ కాలం సాగిన హింసాత్మక ప్రదర్శనలు.. చైనాకు ‘ చెంపపెట్టు ‘

హాంకాంగ్ లో కొన్ని నెలల పాటు సాగిన హింసాత్మక ఆందోళనలు ఈ దశాబ్దపు చరిత్ర లోనే కొత్త ‘ నిరసన ప్రదర్శన ‘ లకు దారి తీశాయి. నేరస్థుల అప్పగింత బిల్లుకు నిరసన గాను, తమ ప్రాంతంలో చైనా ఆధిపత్య ధోరణిని దుయ్యబడుతూ హాంకాంగ్ వాసులు నెలల తరబడి ఆందోళనలు చేశారు. 2019 మార్చిలో ప్రారంభమైన ఈ ఆందోళనలు దాదాపు డిసెంబరువరకు కూడా కొనసాగాయి. అల్లర్లు పీక్ స్టేజికి దిగినప్పుడు వీటిని అణచివేయడానికి చైనా పెద్ద సంఖ్యలో తన సైన్యాన్ని హాంకాంగ్ కి తరలించడానికి సిధ్ధపడింది. పైగా నిరసనకారులను భయపెట్టడానికి తన సైనికులకు విద్యుత్ షాక్ ఇచ్ఛే పొడవాటి గన్స్ వంటి ఆయుధాలను కూడా చైనా సమకూర్చింది. అయినా హాంకాంగ్ వాసులు బెదరలేదు. తమ పార్లమెంటు ముట్టడికి సైతం యత్నించారు. ఎంతోమంది ఆందోళనకారులు అరెస్టయ్యారు. సుమారు నెల రోజుల క్రితం జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో స్థానికులు భారీగా విజయం సాధించి.. చైనీయులకు చుక్కలు చూపారు. ప్రజాస్వామ్య పధ్దతిలో జరిగిన ఈ ఎన్నికల్లో వీరి ఘన విజయాలు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ కు సైతం షాక్ ఇచ్చాయి. పరోక్షంగా ఆమె తన ఓటమిని అంగీకరించక తప్పలేదు.

అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న టారిఫ్ వార్

అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ ఇంకా కొనసాగుతోంది. తమ వస్తువులపై చైనా సుంకాలు పెంచడాన్ని సహించలేని అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆ దేశంపై కారాలుమిరియాలు నూరారు. చైనా చర్యకు నిరసనగా ఆ దేశానికి ఆర్థికంగా నష్టం కలిగించేందుకు దాదాపు ఎనభై కోట్ల డాలర్లకు పైగా విలువైన ‘ ఆంక్షలను విధించారు. దీనివల్ల అమెరికాలో చైనా సరుకులకు డిమాండ్ తగ్గిపోయింది. అయితే చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మాత్రం వెనక్కి తగ్గలేదు.. అమెరికా మీద తమ ట్రేడ్ వార్ కొనసాగుతుందని హెచ్చరించాడు. అవసరమైతే యుఎస్ తో శాశ్వతంగా తమ వాణిజ్య లావాదేవీలను నిలిపివేస్తామని కూడా పేర్కొన్నాడు.

కాశ్మీర్ అంశంపై ఐరాస సమావేశాల్లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ‘ నోటిదురుసు ‘

భారత-పాకిస్థాన్ దేశాల మధ్య కంట్లో నలుసులా ఉన్న కాశ్మీర్ అంశాన్ని పాక్ ఎప్పుడూ అంతర్జాతీయం చేయడానికి యత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో ఈ సమస్యను లేవనెత్తడానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేయని ప్రయత్నమంటూ లేదు.. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేయడం ద్వారా భారత ప్రభుత్వం కయ్యానికి కాలు దువ్వుతోందని గత సెప్టెంబరులో జరిగిన ఐరాస సమావేశాల్లో ఆయన ఎలుగెత్తి అరిచారు. అణు సంపన్న దేశమైన ఇండియా వైఖరి కారణంగా సరిహద్దుల్లో యుధ్ధమేఘాలు ఆవరిస్తున్నాయని ఆరోపించాడు. తాము కూడా బెదిరేది లేదని, యుధ్ధానికి రెడీ అని బీరాలు పలికాడు. అయితే కాశ్మీర్ విషయంలో భారత్ పాటిస్తున్న  వైఖరిని అమెరికా వంటి అగ్రరాజ్యాలు \ఆమోదించాయి. ఇండియా, పాకిస్థాన్ కోరితే ఈ సమస్య పరిష్కారానికి తాను మధ్యవర్తిగా ఉంటానన్న ట్రంప్ కూడా మెత్తపడక తప్పలేదు. ఇది తమ అంతర్గత సమస్య అన్న భారత్ వాదనకు ఇష్టం ఉన్నా.. లేకున్నా తల ఊచక తప్పలేదు. దీంతో ఇమ్రాన్ ఖాన్ గళం కూడా మూగబోయింది.

 అణు నిరాయుధీకరణపై అమెరికా- నార్త్ కొరియా మధ్య నిలిచిపోయిన చర్చలు .. కిమ్ ‘ హుంకారం ‘

అమెరికా- ఉత్తర కొరియా మధ్య అణు సంబంధ చర్చలు అసంపూర్తిగా ఆగిపోయాయి. ఈ విషయంలో ట్రంప్ చొరవ చూపుతున్నప్పటికీ నార్త్ కొరియా అధినేత కిమ్ మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు. రెండు దేశాల మధ్య మైత్రి ఉన్నట్టు కనబడుతున్నప్పటికీ..కిమ్ అమెరికా పట్ల ఆగ్రహంతో ఉంటున్నాడు. తమ దేశ క్షిపణిని అమెరికా కూల్చివేసినప్పటినుంచి ఈ దేశాల మధ్య ‘ మైత్రి ‘ బీటలు వారింది. పైగా ఈ క్రిస్మస్ కి ముందే వాషింగ్టన్ కి నా ‘సత్తా’ ఏమిటో చూపుతానని ఆయన హెచ్చరించాడు. త్వరలోనే ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ ని ప్రయోగించేందుకు ఆయన తన సైనికులు, మంత్రులతో సమావేశమయ్యారు. మరి.. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికా స్పందన తెలియాల్సి ఉంది.

Related Tags