తొలి రెండు టెస్టులకు రోహిత్, ఇషాంత్‌లు దూరం.? హిట్‌మ్యాన్‌ స్థానంలో అయ్యర్‌కు చోటు.!

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, పేసర్ ఇషాంత్‌ శర్మ మరికొన్ని రోజుల పాటు ఆస్ట్రేలియా పర్యటనకు దూరం కానున్నారు. వారు ఇంకా ఫిట్‌నెస్ సాధించని కారణంగా ఆసీస్‌తో..

  • Ravi Kiran
  • Publish Date - 4:30 pm, Tue, 24 November 20
India Vs Australia 2020

India Vs Australia 2020: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, పేసర్ ఇషాంత్‌ శర్మ మరికొన్ని రోజుల పాటు ఆస్ట్రేలియా పర్యటనకు దూరం కానున్నారు. వారు ఇంకా ఫిట్‌నెస్ సాధించని కారణంగా ఆసీస్‌తో జరగబోయే మొదటి రెండు టెస్టులకు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. ఇద్దరూ కూడా ఫిట్‌నెస్ సాధించడానికి సుమారు రెండు వారాలు సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు ఇచ్చిన సలహా మేరకు.. బీసీసీఐ రోహిత్, ఇషాంత్‌లను మొదటి రెండు టెస్టులకు దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఆస్ట్రేలియా క్వారంటైన్ నిబంధనలు అనుగుణంగా వీళ్లిద్దరూ మొదటి రెండు టెస్టులు ఆడాలంటే మరో రెండు రోజుల్లో బయల్దేరాల్సి ఉంది. అయితే అది సాధ్యం కాని పని. దీనితో రోహిత్ శర్మ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ సిరీస్‌కు బరిలోకి దింపే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈలోగా రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ ఫిట్‌నెస్ సాధిస్తే మాత్రం.. ఈ ఇద్దరూ జనవరి 7న జరగబోయే మూడో టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటికే యూఏఈ నుంచి సరాసరి ఆస్ట్రేలియా చేరుకున్న 32 సభ్యులతో కూడిన భారత్ టీం.. సిడ్నీలో తమ క్వారంటైన్‌ను పూర్తి చేసుకుని శిక్షణ మొదలుపెట్టింది. అటు భారత్, ఆసీస్ మధ్య తొలి వన్డే ఈ నెల 27వ తేదీన జరగనుంది.

Also Read: 

ఏపీ: డిసెంబర్ 14 నుంచి 6,7 తరగతుల విద్యార్ధులకు క్లాసులు.. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు..]

ప్రముఖ నటుడు అషీష్ రాయ్ క‌న్నుమూత‌.. తీవ్ర విషాదంలో బాలీవుడ్ ఇండస్ట్రీ..

బిగ్ బాస్ 4: ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆ భామేనా.!