వీసా నిబంధనల సడలింపు… విదేశీ హెల్త్ కేర్ వర్కర్లు ఇండియాకు రావచ్చు..

కొన్ని కేటగిరీల విదేశీయులకు ప్రయాణ సంబంధ ఆంక్షలను సడలించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. ఎంపిక చేసిన కేటగిరీలలోని..

వీసా నిబంధనల సడలింపు... విదేశీ హెల్త్ కేర్ వర్కర్లు ఇండియాకు రావచ్చు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 03, 2020 | 6:39 PM

కొన్ని కేటగిరీల విదేశీయులకు ప్రయాణ సంబంధ ఆంక్షలను సడలించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. ఎంపిక చేసిన కేటగిరీలలోని విదేశీయులను దేశంలోకి అనుమతిస్తారు. ఫారిన్ హెల్త్ కేర్ వర్కర్లు, రీసెర్చర్లు, ఇంజనీర్లు, టెక్నీషియన్లను ఇకపై అనుమతించనున్నారు.  దేశంలోని లేబొరేటరీలు, ఫ్యాక్టరీలు, భారత హెల్త్ కేర్ సెక్టార్ లోని ఇతర కేంద్రాల్లో అవసరమైనవారికి పర్మిషన్ లభించనుంది. అయితే ఈ సడలింపు సౌలభ్యాన్ని పొందేందుకు ఆయా వ్యక్తులు గుర్తింపు పొందిన, రిజిస్టర్ అయిన హెల్త్ కేర్ కేంద్రం, లేదా ఫార్మాసిటికల్ కంపెనీ నుంచి గానీ, ఇండియాలోని అక్రిడేటెడ్ యూనివర్సిటీ నుంచి గానీ ‘లెటర్ ఆఫ్ ఇన్విటేషన్’ ను కలిగి ఉండాలి. అంటే  ఆ పత్రాన్ని సమర్పించగలగాలి. అలాగే ఇండియాలో గల విదేశీ వ్యాపారాల్లో తమ వంతు ‘కృషి’ ని అందించడానికి సిధ్దపడిన విదేశీయులను కూడా అనుమతిస్తారు. అయితే స్పోర్ట్స్ కు సంబంధించిన ‘బీ-3’వీసా తప్ప…. వీరికి బిజినెస్ వీసా ఉండాలని ఈ గైడ్ లైన్స్ లో నిర్దేశించారు. ఇలాంటివారు నాన్-షెడ్యూల్డ్/కమర్షియల్ లేదా చార్దర్డ్ విమానాల్లో రావచ్ఛు.