లాక్ డౌన్ వేళ.. ఛార్జీలు ఎత్తేసిన నాలుగు ఛానళ్లు..

India Lock Down: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న నేపధ్యంలో కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో పేదోడు నుంచి పెద్దోడు వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే సోనీ, స్టార్, జీ, వయాకామ్ సంస్థలు తమ నాలుగు చానెళ్లపై అన్ని రకాల టారిఫ్‌ చార్జీలను ఎత్తివేశాయి. రెండు నెలల పాటు ఉచితంగా తమ ప్రసారాలను అందజేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబీఎఫ్) ఓ ప్రకటన కూడా […]

లాక్ డౌన్ వేళ.. ఛార్జీలు ఎత్తేసిన నాలుగు ఛానళ్లు..
Follow us

|

Updated on: Mar 31, 2020 | 10:50 PM

India Lock Down: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న నేపధ్యంలో కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో పేదోడు నుంచి పెద్దోడు వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే సోనీ, స్టార్, జీ, వయాకామ్ సంస్థలు తమ నాలుగు చానెళ్లపై అన్ని రకాల టారిఫ్‌ చార్జీలను ఎత్తివేశాయి. రెండు నెలల పాటు ఉచితంగా తమ ప్రసారాలను అందజేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబీఎఫ్) ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

దీనితో స్టార్ ఉత్సవ్, జీ అన్మోల్, వయాకామ్ 18 కలర్స్ బొకే చానెల్, కలర్స్ రిస్తే సహా నాలుగు చానళ్లు అన్ని డీటీహెచ్, కేబుల్ నెట్‌వర్క్‌లపై రెండు నెలల పాటు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. రోజు రోజుకూ దేశంలో పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు కేంద్రం విధించిన లాక్ డౌన్ దృష్ట్యా టీవి ఛానెళ్ల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇవి చదవండి:

మద్యం ప్రియులకు శుభవార్త.. మూడు నెలలు బీర్లు ఫ్రీ.. ఫ్రీ..

EMIలపై కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన పలు బ్యాంకులు..

తెలంగాణ లాక్ డౌన్.. ఏప్రిల్ 14 వరకు మద్యం దుకాణాలు బంద్..