దేశంలో కొత్తగా 86,961 కరోనా కేసులు

భారత దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు దాదాపు 95 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా ఇవాళ కాస్త తగ్గుమొఖం పట్టింది.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,961 కేసులు నమోదయ్యాయి.

దేశంలో కొత్తగా 86,961 కరోనా కేసులు
Follow us

|

Updated on: Sep 21, 2020 | 1:59 PM

భారత దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు దాదాపు 95 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా ఇవాళ కాస్త తగ్గుమొఖం పట్టింది.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,961 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 54,87,581 కి చేరుకుంది. కాగా, ఇవాళ కొత్తగా మరో 1,130 మంది కరోనా బారినపడి మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కొవిడ్ బారినపడి మరణించినవారి సంఖ్య 87,882 కు చేరింది. దేశంలో నిన్నటి వరకు కరోనా నుంచి 43,96,399 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,03,299 మంది వివిధ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 79.68 ఉండగా మరణాల రేటు 1.61 గా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

అంతేగాకుండా ప్రపంచ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటులో అత్యధిక శాతం భారత్ లోనే ఉందని తెలిపింది. భారత్ లో 43 లక్షల 96 వేల మంది కోలుకున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా రికవరీ రేటులో 19 శాతం. అమెరికాలో 42 లక్షల మంది కోలుకున్నారు. ఇది ప్రపంచ రికవరీ రేటులో 18.70 శాతంగా ఉందని తెలిపింది.