భారత్​ – చైనా లెఫ్టినెంట్​ జనరళ్ల సమావేశం.. అదే కీలక అంశం

భారత్​-చైనా మధ్య లెఫ్టినెంట్​ జనరళ్ల స్థాయిలో సమావేశం ఇవాళ జరగనుంది. ఈ సమావేశానికి చుషుల్​ ప్రాంతం వేదిక కానుంది. ఇరు దేశాల మధ్య ఈ తరహా సమావేశం జరగడం ఇది మూడోసారి. ఈ నెల‌ 6, 22వ తేదీల్లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా వైపు ఉన్న మోల్డో ప్రాంతంలో ఇరుదేశాల లెఫ్టినెంట్‌ జనరళ్లు చర్చలు జరపగా.. ఈ సారి భారత్‌ వైపు ఉన్న చుషుల్‌లో ఇరువురు భేటీ కానున్నారు. గల్వాన్‌ ఘర్షణల తర్వాత ఉద్రిక్తతలు తగ్గించే […]

భారత్​ - చైనా లెఫ్టినెంట్​ జనరళ్ల సమావేశం.. అదే కీలక అంశం
Follow us

|

Updated on: Jun 30, 2020 | 5:11 AM

భారత్​-చైనా మధ్య లెఫ్టినెంట్​ జనరళ్ల స్థాయిలో సమావేశం ఇవాళ జరగనుంది. ఈ సమావేశానికి చుషుల్​ ప్రాంతం వేదిక కానుంది. ఇరు దేశాల మధ్య ఈ తరహా సమావేశం జరగడం ఇది మూడోసారి. ఈ నెల‌ 6, 22వ తేదీల్లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా వైపు ఉన్న మోల్డో ప్రాంతంలో ఇరుదేశాల లెఫ్టినెంట్‌ జనరళ్లు చర్చలు జరపగా.. ఈ సారి భారత్‌ వైపు ఉన్న చుషుల్‌లో ఇరువురు భేటీ కానున్నారు. గల్వాన్‌ ఘర్షణల తర్వాత ఉద్రిక్తతలు తగ్గించే అంశాలపై ఇవాళ్టి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు ఈ భేటీ మొదలుకానుంది.