భారత్ – చైనా సరిహద్దులో ఉద్రిక్తత – మోహరిస్తున్న బలగాలు..!

కరోనావైరస్ మహమ్మారితో ప్రపంచాన్ని అతలాకుతం చేసిన చైనా.. తాజా పరిణామాలతో భారత సరిహద్దు ప్రాంతంలో టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. ఇటీవ‌ల స‌రిహ‌ద్దు ప్రాంతంలో చైనా ఆర్మీ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ల‌ఢ‌ఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ (LAC) దాటి భార‌త భూభాగంలోకి ప్ర‌వేశించి.. త‌మ ప్రాంత‌మంటూ హడావిడి చేసింది. భార‌త బ‌ల‌గాల‌తో చైనా సైనికులు తోపులాట‌కు దిగారు. దీంతో స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసింది. త‌ర‌చుగా ఇటువంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్పడుతోంది డ్రాగన్ దేశం. తాజాగా ల‌ఢ‌ఖ్ […]

భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తత -  మోహరిస్తున్న బలగాలు..!
Follow us

|

Updated on: May 25, 2020 | 6:10 PM

కరోనావైరస్ మహమ్మారితో ప్రపంచాన్ని అతలాకుతం చేసిన చైనా.. తాజా పరిణామాలతో భారత సరిహద్దు ప్రాంతంలో టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. ఇటీవ‌ల స‌రిహ‌ద్దు ప్రాంతంలో చైనా ఆర్మీ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ల‌ఢ‌ఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ (LAC) దాటి భార‌త భూభాగంలోకి ప్ర‌వేశించి.. త‌మ ప్రాంత‌మంటూ హడావిడి చేసింది. భార‌త బ‌ల‌గాల‌తో చైనా సైనికులు తోపులాట‌కు దిగారు. దీంతో స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసింది. త‌ర‌చుగా ఇటువంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్పడుతోంది డ్రాగన్ దేశం. తాజాగా ల‌ఢ‌ఖ్ స‌రిహ‌ద్దు ద‌గ్గ‌ర దాదాపు 5 వేల మంది సైనికుల‌ను మోహ‌రించింది చైనా. దౌల‌త్ బెగ్ ఓల్డీ స‌హా పలు ఏరియాల్లో చైనా ఆర్మీ సైనికులు మోహరించారు . ఈ నేప‌థ్యంలో భార‌త ఆర్మీ కూడా అప్ర‌మ‌త్త‌మైంది. స‌రిహ‌ద్దుల్లో చైనా ఆర్మీ మ‌న భూభాగంలోకి రాకుండా అడ్డుకునేందుకు రంగంలోకి దిపింది. భార‌త ఆర్మీ 81, 114 బ్రిగేడ్స్ ను వాస్త‌వాధీన రేఖ వెంట మోహ‌రిస్తోంది. భార‌త ఆర్మీ, ఐటీబీపీ బ‌ల‌గాల‌ను ల‌ఢ‌ఖ్ లోని ప‌లు ప్రాంతాల‌కు పంపుతోంది. ఫాన్ గొంగ్ లేక్ స‌హా మ‌రికొన్ని కీల‌క ప్రాంతాల‌కు చైనా ఆర్మీ భారీ వాహ‌నాల‌తో త‌ర‌లివ‌స్తున్న‌ట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో భారత భూభాగం వైపుకు రోడ్లు నిర్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నాట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ చైనా ఆర్మీ టెంట్లు ఏర్పాటు చేసుకోవ‌డంపట్ల మ‌న ఆర్మీతో పాటు భార‌త విదేశాంగ శాఖ అభ్యంత‌రాలు తెలిపింది. స‌రిహ‌ద్దు వెంట త‌ర‌చూ ఇరు దేశాల సైనికుల కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. గ‌త వారంలో ల‌ఢ‌ఖ్ లోని నార్త్ ఫాన్ గొంగ్ వ‌ద్ద ఇరు దేశాల సైనికుల మ‌ధ్య స్టాండ్ ఆఫ్ జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో తోపులాట‌లు జ‌ర‌గ‌డంతో ప‌లువురు సైనికుల‌కు గాయాలు సైతం అయ్యాయి. ఇది ఇరు వైపులా సైనికులు పెట్రోలింగ్ లో ఒకే సారి ఎదురుప‌డిన స‌మ‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న‌గా సైనిక వ‌ర్గాలు చెప్పాయి.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో