Breaking News
  • తెలంగాణ నీటిపారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు. జల వనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించిన సీఎం. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంపు హౌజులు, ఆయకట్టు పెరిగినందున పనిభారం పెరిగింది. మారిన పరిస్థితికి అనుగుణంగా జల వనరుల శాఖలో సిఇలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన పీఎం.
  • తెలంగాణకు మరో భారీ పెట్టుబడి: మెడికల్ డివైస్ తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మెడ్ ట్రానిక్స్ 1200 కోట్ల పెట్టుబడి. ఇప్పుడున్న తన అర్ అండ్ డి సెంటర్ ను 1200 కోట్లతో విస్తరించనున్న మెడ్ ట్రానిక్స్. అమెరికా అవతల మెడ్ ట్రానిక్ అతిపెద్ద అర్ అండ్ డి సెంటర్ ఇదే ఈ పెట్టుబడికి తెలంగాణ అనకూలమన్న కంపెనీ చైర్మన్ ఒమర్ ఇస్రాక్ రెండేళ్లుగా నిరంతరం కంపెనీతో చర్చిస్తున్న తెలంగాణ రాష్ర్టం. ఈ పెట్టుబడితో భారతదేశ మెడ్ టెక్ హబ్ గా హైదరాబాద్ మారుతుందన్న మంత్రి కెటియార్.

  • కేరళ : కేరళ రాష్ట్రం లోని మున్నారు లో విరిగిపడ్డ కొండ చరియలు కారణం గా ఇప్పటివరకు 52 మంది మృతి ,20 మంది గల్లంతు . గల్లంతయిన వారిలో 20 మంది కోసం కొనసాగుతున్న రెస్క్యూ . మృతి చెందినవారిలో ఎక్కువశాతం తమిళనాడుకి చెందిన వారే.
  • రాజధాని వికేంద్రీకరణ మరియు సిఆర్డిఏ రద్దు బిల్లుల పై కోర్టు లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు బాధ్యతలు మునిపల్ శాఖ కార్యదర్శి శ్యామల రావు కి అప్పగింత . అనేక డిపార్ట్మెంట్ లను ప్రతివాదులుగా చేరుస్తున్న నేపధ్యంలో కౌంటర్ అఫిడవిట్ కోసం శ్యామల రావును నామినేట్ చేసిన సర్కార్ . చీఫ్ సెక్రటరీ తో సహా మిగిలిన అధికారుల బదులు కౌంటర్ అఫిడవిట్ లో శ్యామల రావు సంతకం చేసేలా ఆదేశం. శ్యామల రావు అందుబాటులో లేని పక్షంలో మునిసిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రామ్ మనోహర్ రావు కు ఆ బాధ్యతలు . ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.
  • కడప జిల్లా: మాజీ మంత్రి సీనియర్ నేత ఖలీల్ బాష కన్నుమూత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖలీల్ బాష. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మాజీ మంత్రి.
  • ట్విట్టర్లో దూసుకెళ్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ట్విట్టర్ ఇండియా ట్రెండ్స్ లో 2 వ స్థానంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఇవాళ ఒక్కరోజే 70 వేలా ట్వీట్లతో దూసుకెళ్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఫలించిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మూడేళ్ళ కృషి. సెలబ్రిటీలు, వివిధ వర్గాల ప్రజల్లో గ్రీనరీ ఆవశ్యకతపై విశేష అవగాహన తీసుకొస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజనరీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై నెటిజెన్ల ప్రశంసల ఝల్లు.

విద్యార్థులు లేకుండానే ఎర్రకోట స్వాతంత్ర్య వేడుకలు

చరిత్రలో తొలిసారి భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సాదాసీదాగా నిర్వహించేందుకు కేంద్రం ఫ్లాన్ చేస్తోంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అమలవుతున్న నిబంధనల కారణంగా నిరాడంబరంగా విద్యార్థినీ, విద్యార్థులు లేకుండా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
independence day celebrations planned due to covid-19 no school children to take part, విద్యార్థులు లేకుండానే ఎర్రకోట స్వాతంత్ర్య వేడుకలు

చరిత్రలో తొలిసారి భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సాదాసీదాగా నిర్వహించేందుకు కేంద్రం ఫ్లాన్ చేస్తోంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అమలవుతున్న నిబంధనల కారణంగా నిరాడంబరంగా విద్యార్థినీ, విద్యార్థులు లేకుండా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గతంలో మాదిరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా కాకుండా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించే కార్యక్రమానికి గతంలో కంటే ఈ ఏడాది కేవలం 20 శాతం మంది వీవీఐపీలు, ప్రేక్షకులు మాత్రమే అనుమతినివ్వనున్నట్లు సమాచారం. ఇటీవల కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్.. ఎర్ర కోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవాల సన్నాహాలను పరిశీలించారు. కరోనా దృష్ట్యా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ వేడుకల్లో ఈసారి విద్యార్థినీ, విద్యార్థులు పాలుపంచుకోబోరని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నేషనల్ కేడెట్ కార్ప్స్ కేడెట్లు మాత్రమే పాల్గొంటారని తెలుస్తోంది.

ఈ వేడుకలకు కేవలం 100 మంది ప్రముఖులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకున్న 1,500 మంది ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. వీరిలో 500 మంది స్థానిక పోలీసు సిబ్బంది కాగా, మిగిలినవారు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు ఉండబోతున్నట్లు సమాచారం.

Related Tags