త్వరలో ట్రంప్‌, ఇమ్రాన్‌ఖాన్‌‌ల భేటీ

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషి వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఖురేషి.. జూన్‌లోనే ఇమ్రాన్‌ అమెరికా పర్యటన ఖరారైంది కానీ దేశీయ కార్యక్రమాలు, 2019 బడ్జెట్‌ కారణంగా వాయిదా పడిందని తెలిపారు. ఈ పర్యటనలో 5రోజులపాటు సాగనుండగా..ఇందులో భాగంగా ఇమ్రాన్‌ఖాన్‌ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కానున్నారని తెలిపారు. ముఖ్యమైన ప్రాంతీయ సమస్యలపై చర్చల కోసం ట్రంప్‌ ఆహ్వానం మేరకు ఇమ్రాన్‌ […]

త్వరలో ట్రంప్‌, ఇమ్రాన్‌ఖాన్‌‌ల భేటీ
Follow us

|

Updated on: Jun 30, 2019 | 5:24 AM

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషి వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఖురేషి.. జూన్‌లోనే ఇమ్రాన్‌ అమెరికా పర్యటన ఖరారైంది కానీ దేశీయ కార్యక్రమాలు, 2019 బడ్జెట్‌ కారణంగా వాయిదా పడిందని తెలిపారు.

ఈ పర్యటనలో 5రోజులపాటు సాగనుండగా..ఇందులో భాగంగా ఇమ్రాన్‌ఖాన్‌ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కానున్నారని తెలిపారు. ముఖ్యమైన ప్రాంతీయ సమస్యలపై చర్చల కోసం ట్రంప్‌ ఆహ్వానం మేరకు ఇమ్రాన్‌ వాషింగ్టన్‌ వెళ్తున్నారని ఖురేషి తెలిపారు. పాకిస్థాన్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం జులై 20న ఇమ్రాన్‌ఖాన్‌ అమెరికా పర్యటనకు బయలుదేరనున్నారు. వీరిద్దరి సమావేశం కోసం కొన్ని నెలలుగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.