అక్కడ 24 గంటల్లో గ్రామాన్నే నిర్మించారు..!

లాటిన్ అమెరికాకు చెందిన ఐకాన్ అనే కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీస్ సంస్థ కొత్త తరహా ఇళ్ల నిర్మాణంతో ముందుకొచ్చింది. 3డీ టెక్నాలజీ సహాయంతో 24 గంటల వ్యవధిలో ఏకంగా గ్రామాన్నే నిర్మించి అబ్బురపరిచింది.

అక్కడ 24 గంటల్లో గ్రామాన్నే నిర్మించారు..!
Follow us

|

Updated on: Jun 05, 2020 | 6:49 PM

ఒక ఇల్లు కట్టాలంటే కనీసం ఆరు నెలలు. పనివాళ్లు దొరకపోతే మరో మూడు నెలలు. నిర్మాణ పనులు స్లోగా సాగితే.. సరిగ్గా ఇళ్లు పూర్తి కావాలంటే ఏడాది పట్టాల్సిందే. అలాంటిది ఒక్కరోజు ఓ గ్రామాన్నే నిర్మాణం చేసి చూపించారు లాటిన్ అమెరికా కన్‌స్ట్రక్షన్ కంపెనీ. లాటిన్ అమెరికాకు చెందిన ఐకాన్ అనే కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీస్ సంస్థ కొత్త తరహా ఇళ్ల నిర్మాణంతో ముందుకొచ్చింది. 3డీ టెక్నాలజీ సహాయంతో 24 గంటల వ్యవధిలో ఏకంగా గ్రామాన్నే నిర్మించి అబ్బురపరిచింది. 50 కుటుంబాలు నివసించే ఆ గ్రామంలో ఒకే ఆకారంలో ఉండే ఇండ్లను నిర్మిస్తున్నారు. కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఒక భవనాన్ని పూర్తి చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. కనీస వసతి లేని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు సరియైన సమయంలో పూర్తి చేయాలన్న సంకల్పంతో త్రీడీ ఇండ్ల నిర్మాణ ఆలోచన పుట్టింది. నీరు, కరంట్, కూలీల వసతి దొరకకపోవడం వల్ల నిర్మాణం ఆలస్యం అవడమే కాకుండా, ఖర్చు కూడా పెరుగుతుంది. దీంతో నిర్మాణ వ్యయాలు తగ్గించుకునేందుక ఈ 3డీ హౌజెస్ ఎంతో మేలంటున్నారు సంస్థ ప్రతనిధులు. ఇక్కడ నిర్మిస్తున్న ఇంటికి అన్ని హంగులను సమకురుస్తున్నారు. ప్రతి ఇంటికి బయటవైపు కిచెన్‌రూమ్, చుట్టూ కూరగాయలు పండించడానికి స్థలం విశాలవంతమైన గదులతో రూపొందించారు. ఈ ఆలోచన వల్ల గృహ నిర్మాణ రంగంలో కీలకంగా మార్పులు రానున్నాయి. రెండు వందల డాలర్ల పెట్టుబడి సొంత ఇంటి కలను సాకారం చేసుకోవచ్చంటోంది ఐకాన్ కన్‌స్ట్రక్షన్ సంస్థ. ప్రస్తుతం ఈ గ్రామానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక విదేశీ ప్రతినిధులు సైతం సందర్శిస్తున్నారు. నిరాస్యులైన పేదలకు ఇలాంటి ఇళ్లను నిర్మించి ఇవ్వడం ద్వారా వ్యయంతో పాటు సమయం కలిసొస్తుందంటున్నారు నిపుణులు.

Latest Articles
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే