బ్రేకింగ్: కులభూషణ్ మరణశిక్షపై స్టే

అంతర్జాతీయ కోర్టులో భారత్ విజయం సాధించింది. కులభూషణ్‌కు పాకిస్తాన్ మిలిటరీ కోర్టు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. ఈ తీర్పును పున: సమీక్షించాలని న్యాయస్థానం పాకిస్తాన్‌కు సూచించింది. మొత్తం 16మందిలో 15మంది జడ్జిలు భారత్‌కు తమ మద్దతును ప్రకటించారు. ఈ కేసులో భారత్ న్యాయవాదిని ఏర్పాటుచేసుకునే హక్కు ఉందని ఐసీజే ప్రకటించింది. అయితే 2016లో కుల్‌భూషణ్ జాదవ్‌ను బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పాకిస్తాన్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. గూఢాచార్యం కింద అక్కడి మిలిటరీ కోర్టు.. 2017లో […]

బ్రేకింగ్: కులభూషణ్ మరణశిక్షపై స్టే
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 18, 2019 | 9:50 AM

అంతర్జాతీయ కోర్టులో భారత్ విజయం సాధించింది. కులభూషణ్‌కు పాకిస్తాన్ మిలిటరీ కోర్టు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. ఈ తీర్పును పున: సమీక్షించాలని న్యాయస్థానం పాకిస్తాన్‌కు సూచించింది. మొత్తం 16మందిలో 15మంది జడ్జిలు భారత్‌కు తమ మద్దతును ప్రకటించారు. ఈ కేసులో భారత్ న్యాయవాదిని ఏర్పాటుచేసుకునే హక్కు ఉందని ఐసీజే ప్రకటించింది.

అయితే 2016లో కుల్‌భూషణ్ జాదవ్‌ను బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పాకిస్తాన్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. గూఢాచార్యం కింద అక్కడి మిలిటరీ కోర్టు.. 2017లో అతడికి మరణ శిక్ష విధించింది. అయితే, ఈ తీర్పును భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసింది. అమాయకుడైన కులభూషణ్ జాదవ్‌‌ను దోషిగా చిత్రీకరించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి 21 వరకూ సాగిన విచారణలో భారత్‌, పాకిస్తాన్‌లు తమ వాదనలను న్యాయస్ధానానికి నివేదించాయి.