క‌రోనా చికిత్స‌కు.. ప్రత్యేక బ్రూఫిన్..?

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కట్టడి కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో సాధార‌ణ‌ నొప్పుల కోసం వాడే బ్రూఫిన్ ట్యాబ్లెట్‌ను..

క‌రోనా చికిత్స‌కు.. ప్రత్యేక బ్రూఫిన్..?
Follow us

| Edited By:

Updated on: Jun 03, 2020 | 4:49 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కట్టడి కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో సాధార‌ణ‌ నొప్పుల కోసం వాడే బ్రూఫిన్ ట్యాబ్లెట్‌ను.. క‌రోనా రోగులపై బ్రిట‌న్ డాక్ట‌ర్లు ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్నారు. కోవిడ్19 వ్యాధితో బాధ‌ప‌డేవారికి ఈ మాత్ర‌ల‌ను ప‌రీక్షించాల‌ని భావిస్తున్నారు. లండన్స్ గ‌య్స్ , సెయింట్ థామ‌స్ హాస్పిట‌ల్‌, కింగ్స్ కాలేజీకి చెందిన బృందం.. బ్రూఫిన్ మందుల‌ను ప‌రీక్షిస్తున్న‌ది.

కాగా.. పెయిన్ కిల్ల‌ర్ గా వాడే బ్రూఫిన్ మాత్ర‌లు, శ్వాస‌కోస ఇబ్బందుల్ని కూడా దూరం చేస్తాయ‌ని డాక్ట‌ర్లు భావిస్తున్నారు. చాలా త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులో ఉండే ఈ మాత్ర‌ల వ‌ల్ల.. ఖ‌రీదైన వెంటిలేట‌ర్ చికిత్స‌కు క‌రోనా రోగులు దూరం కావొచ్చు అన్న అభిప్రాయం వ్య‌క్తం అవుతున్న‌ది. బ్రిట‌న్‌లో క‌రోనా పేషెంట్ల‌కు కింగ్స్ కాలేజీ డాక్ట‌ర్లు ప్ర‌స్తుతం బ్రూఫిన్ మాత్ర‌ల‌ను ప‌రీక్షిస్తున్న‌ట్లు ఓ స్ట‌డీ ద్వారా తెలుస్తోంది. సాధార‌ణ బ్రూఫిన్ కాకుండా, ప్ర‌త్యేక ఫార్ములాతో త‌యారు చేసిన బ్రూఫిన్ ట్యాబ్లెట్ల‌ను డాక్ట‌ర్లు ప‌రీక్షించ‌నున్నారు.

మరోవైపు.. జంతువుల‌పై జ‌రిగిన ట్రయల్స్ లో బ్రూఫిన్ మాత్ర‌ల‌తో శ్వాస‌కోస ఇబ్బందులు న‌యం అవుతాయ‌ని నిర్ధారించారు. మ‌నుషుల‌పై బ్రూఫిన్ ప‌రీక్ష‌ల‌ను చేప‌ట్ట‌నున్న‌ట్లు కింగ్స్ కాలేజీ ప్రొఫెస‌ర్ మితుల్ మెహ‌తా తెలిపారు. క‌రోనా రోగుల చికిత్స కోసం వాస్త‌వానికి పారాసిట‌మాల్ లేదా బ్రూఫిన్ వాడాలా అన్న కొంత మీమాంస ఉండేది. మొదట్లో ఎక్కువ శాతం మంది డాక్ట‌ర్లు.. పారాసిట‌మాల్ వాడాల‌న్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.