నేను పక్కా లోకల్: గంభీర్

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఈ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి విదితమే. అయితే గంభీర్ నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి అరవిందర్ సింగ్ లవ్లీ ప్రచారం చేస్తున్నారు. దీనిపై గంభీర్ నిప్పులు చెరిగారు. తాను పుట్టింది, పెరిగింది ఢిల్లీలోనే అని స్పష్టం చేశారు. తన తండ్రి 45 ఏళ్లుగా ఢిల్లీలో వస్త్రవ్యాపారం చేస్తున్నారని, అలాంటప్పుడు తాను నాన్ లోకల్ ఎలా అవుతానని గంభీర్ ప్రశ్నించారు. తనను స్థానికేతరుడు […]

నేను పక్కా లోకల్: గంభీర్
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2019 | 4:40 PM

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఈ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి విదితమే. అయితే గంభీర్ నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి అరవిందర్ సింగ్ లవ్లీ ప్రచారం చేస్తున్నారు. దీనిపై గంభీర్ నిప్పులు చెరిగారు. తాను పుట్టింది, పెరిగింది ఢిల్లీలోనే అని స్పష్టం చేశారు. తన తండ్రి 45 ఏళ్లుగా ఢిల్లీలో వస్త్రవ్యాపారం చేస్తున్నారని, అలాంటప్పుడు తాను నాన్ లోకల్ ఎలా అవుతానని గంభీర్ ప్రశ్నించారు. తనను స్థానికేతరుడు అంటూ ప్రచారం చేయడం వెనుక కాంగ్రెస్ ఉద్దేశాలు ఏంటో తెలియడంలేదన్నారు.

దేశానికి నరేంద్ర మోదీ అందిస్తున్న సేవలతో ప్రభావితం అయ్యానని, ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు వివరించారు. తాను ఎన్నికల్లో గెలిస్తే తూర్పు ఢిల్లీని అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేస్తానని గంభీర్ తెలిపారు.

Latest Articles