హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రి, కరోనా వారియర్స్‌పై వాయుసేన పూల వర్షం

ఈ మేరకు హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలోని జయశంకర్‌ విగ్రహం దగ్గర వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది, పోలీసులు, నాలుగో తరగతి ఉద్యోగులపై వాయుసేన హెలికాఫ్టర్‌...

హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రి, కరోనా వారియర్స్‌పై వాయుసేన పూల వర్షం
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 10:38 AM

దేశంలో కరోనా వైరస్‌ అంతకంతకూ విస్తరిస్తోంది. అయితే దానికి కట్టడి చేసేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ఇలా అందరూ అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారి శ్రమకు తగినట్టు ఎన్ని పాజిటివ్‌ కేసులు పెరిగినా వైద్య సిబ్బంది అందిస్తున్న సేవల కారణంగా కరోనా బాధితులు సంపూర్ణంగా కోలుకుని ఇళ్లకు వెళుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో దేశ త్రివిధ దళాలు ఇవాళ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాయి. ఈ మేరకు హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలోని జయశంకర్‌ విగ్రహం దగ్గర వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది, పోలీసులు, నాలుగో తరగతి ఉద్యోగులపై వాయుసేన హెలికాఫ్టర్‌ ద్వారా పూలవాన కురిపించారు. డాక్టర్లు, పోలీసులు, మీడియా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మిక సిబ్బందిపై పూల వర్షం కురింపించింది వాయు సేన. కాగా దాదాపు మూడు రౌండ్లు వారిపై పూలు కురిపించాయి హెలికాఫ్టర్స్.

Read More:

గుడ్‌న్యూస్: ఉద్యోగులకు, వ్యాపారులకు ‘కరోనా లోన్’

బాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ.. ప్రముఖ దర్శకుడితో సినిమా!