Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 20 వేల 903 మంది వైరస్​ సోకింది. మరో 379 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,544. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,27,439. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,79,892. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,213.
  • భారత్ బయోటెక్‌కు ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ లేఖ. భారత కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ వేగవంతం చేయాలని సూచన. ఫాస్ట్-ట్రాక్ పద్ధతిలో క్లినికల్ ట్రయల్స్ చేస్తే ఆగస్ట్ 15 నాటికి అందుబాటులోకి వ్యాక్సిన్. పంద్రాగస్టు సందర్భంగా వ్యాక్సిన్ లాంఛ్ చేసే అవకాశం.
  • అమరావతి: మంత్రివర్గ విస్తరణ 22న? రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్దం చేస్తునట్టు సమాచారం. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు. కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక పై కసరత్తు?
  • తల్లితండ్రుల పిల్ పై హైకోర్టులో విచారణ వాయిదా. 13వ తారీఖున సమగ్ర నివేదికతో రమ్మని ప్రభుత్వానికి చెప్పిన హైకోర్టు. ఇంకా విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదని కోర్టుకు తెలిపిన ఏజీ. ఏ నిర్ణయం తీసుకోకుండా ఆన్లైన్ క్లాసులు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు. కేసులో ఇంప్లీడ్ అయిన ఇండిపెండెంట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్. రెండు నెలల క్రితమే సీబీఎస్ఈ సిలబస్ ప్రారంభమైందని తెలిపిన isma తరపు సీనియర్ న్యాయవాది. ఆన్లైన్ తరగతులపై తల్లిదండ్రులకు పై ఎలాంటి ఒత్తిడి లేదు. ఆన్లైన్ క్లాసెస్ ఆప్షన్ మాత్రమే అని తెలిపిన ఇస్మా తరపు న్యాయవాది.
  • ఎయిమ్స్ నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ప్రధమ స్థానం సాధించిన చిలకలూరిపేటకు చెందిన ప్రతాప్ కుమార్. వంద మార్కులకు గాను 91 మార్కులు సాధించిన ప్రతాప్ కుమార్.
  • ఈరోజు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు. రాగల మూడు రోజులు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు. ఉపరితల ఆవర్తనం తో పాటు షీర్ జోన్ ఏర్పడింది. ఆంధ్ర తీరానికి సమీపంలో కేంద్రీక`తమైన ఆవర్తనం. పశ్చిమ బంగాళాఖాతం లో 3.1 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. - వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్టు రాజారావు.
  • జ్యూడిషయల్ లోకరోనా కలకలం . సికింద్రాబద్ జ్యుడీషయల్ అకాడమీ లో కరోనాతో అటెండర్ మృతి . జ్యుడిషయల్ అకాడమీ కేంద్రం గా జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్. ఆందోళనలో న్యాయవాదులు.

‘జెర్సీ’ సినిమాలోలా.. గ్రౌండ్‌లోనే మృతి చెందిన హైదరాబాద్ క్రికెటర్..!

Hyderabad: cricketer dies in field, ‘జెర్సీ’ సినిమాలోలా.. గ్రౌండ్‌లోనే మృతి చెందిన హైదరాబాద్ క్రికెటర్..!

హైదరాబాద్ మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాదం జరిగింది. గ్రౌండ్‌లోనే గుండెపోటుతో కుప్పకూలిన క్రికెటర్‌.. అక్కడే తుది శ్వాస విడిచాడు. బాలాజీనగర్‌కు చెందిన వీరేందర్‌నాయక్‌‌కు క్రికెట్ అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి అతడికి క్రికెటే లైఫ్‌ అయిపోయింది. అందుకే అతడు చదువుకుంటున్నా, జాబ్ చేస్తున్నా, పెళ్లై.. పిల్లలున్నా కూాడా క్రికెట్‌ను వదిలెేయలేదు. చివరికి అతడు చివరిశ్వాసలో కూడా క్రికెట్‌ను వదిలిపెట్టలేదు.

రెండు నెలల క్రితం మైనర్ హార్ట్ స్ట్రోక్ రావడంతో అతడు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో క్రికెట్‌కి దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు సూచించారు. అయినప్పటికి అతడు బ్యాట్ పట్టకుండా, గ్రౌండ్‌లోకి దిగకుండా ఉండలేకపోయాడు. ఆదివారం ఈస్ట్‌ మారేడుపల్లి జీహెచ్‌ఎంసీ మైదానంలో ఎంపీ స్పోర్టింగ్‌, ఎంపీ బ్ల్యూస్‌ జట్ల మధ్య జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌లో ఎంపీ బ్ల్యూస్‌ టీం తరుపున బ్యాట్ పట్టాడు. చాలాసేపు బ్యాటింగ్ చేసిన వీరేందర్ నాయక్ 55 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. కానీ అప్పటికే అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురై.. అమాంతం కుప్పకూలిపోయాడు. వెంటనే అలర్టయిన స్టాఫ్, తోటి ప్లేయర్స్.. సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే అతడు ప్రాణాలు విడిచినట్టు డాక్టర్లు నిర్దారించారు.

Related Tags