మనసున్న మనిషి.. రెస్టారెంట్‌ దొంగపై కేసు పెట్ట‌ని య‌‌జ‌మాని!

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రజా జీవనం స్తంభించిపోయింది. అర్తకవ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో

మనసున్న మనిషి.. రెస్టారెంట్‌ దొంగపై కేసు పెట్ట‌ని య‌‌జ‌మాని!
Follow us

| Edited By:

Updated on: May 31, 2020 | 4:14 PM

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రజా జీవనం స్తంభించిపోయింది. ఆర్థికవ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లాలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌ధ్యంలో ఒక వ్య‌క్తి రెస్టారెంట్‌లోకి చొర‌బ‌డి ఆహారం తిన్నాడు. విష‌యం తెలుసుకున్న ఆ రెస్టారెంట్ యజ‌మాని స‌ద‌రు దొంగ‌పై కేసు పెట్టేందుకు నిరాక‌రించారు. ఆక‌లిలో ఉండి ఇలా చేసివుంటాడ‌ని య‌జ‌మాని అన్నారు.

వివరాల్లోకెళితే.. మహారాష్ట్ర యవత్మల్‌లోని గాంధీ చౌక్‌లో ఒక రెస్టారెంట్ ఉంది. ఓ వ్యక్తి రెస్టారెంట్‌లోని కిచెన్‌లోకి చొర‌బ‌డి దొరికి‌నంత ఆహారం తిన్నాడు. తరువాత క్యాష్‌బాక్స్‌లోని రెండు వంద‌ల రూపాయ‌లు తీసుకుని పారిపోయాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. సదరు ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన ఆ వ్య‌క్తిపై పోలీసు కేసు పెట్టడం తనకు ఇష్టం లేదని రెస్టారెంట్ యజమాని రాజేష్ మోర్ తెలిపారు. డ‌బ్బులు లేక మ‌రోవైపు ఆక‌లి తీర్చుకునేందుకు ఆ వ్య‌క్తి దొంగ‌త‌నానికి పాల్ప‌డి ఉంటాడ‌‌ని రాజేష్ అన్నారు.

Also Read: త్వరలో.. మార్కెట్లోకి కరోనావైరస్ టెస్ట్ కిట్.. 10 నిమిషాల్లో ఫలితం..