
సరదాగా నదిలో స్నానం చేద్దామని వెళ్లిన ఆ యువతికి అస్సలు ఊహించని అనుభవం ఎదురైంది. నీటిలో ఏదో కదులుతుంటే చేప అనుకొని పట్టుకున్న ఆమెకు, తీరా అది మొసలి పిల్ల అని తెలియడంతో పై ప్రాణం పైనే పోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వింత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఎండలు మండిపోతుండటంతో చాలామంది నదులు, కాలువల వద్దకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి స్థానిక నదిలో స్నానం చేయడానికి వెళ్ళింది. నీటిలో కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో, కాళ్ల దగ్గర ఏదో చిన్న జీవి కదులుతున్నట్లు గమనించింది. అది చూసేందుకు చేప పిల్లలా ఉండటంతో, ఆ యువతి ఎంతో ఉత్సాహంగా దానిని తన చేతుల్లోకి తీసుకుంది.
ఇది చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓయో వెళ్లినప్పుడు పోలీస్ రైడ్ జరిగితే.! ఈ ఒక్క మాట చెప్పండి మీ జోలికి రారు
ఆ చిన్న జీవిని చేతిలోకి తీసుకోగానే ఆ యువతికి ఏదో తేడాగా అనిపించింది. దాని శరీరం గరుకుగా ఉండటం, తోక ఆకారం భిన్నంగా ఉండటంతో నిశితంగా గమనించింది. అది చేప కాదని, మొసలి పిల్ల అని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఆ యువతి గట్టిగా అరుస్తూ ఆ మొసలి పిల్లను నీటిలో వదిలేసి ఒడ్డుకు పరుగులు తీసింది. ఈ వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయింది. “దేవుడా.. ఎంత ప్రమాదం తృటిలో తప్పింది”, “మొసలి పిల్ల ఉందంటే కచ్చితంగా తల్లి మొసలి దగ్గరలోనే ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ యువతి అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ సారి వీడియోపై లుక్కేయండి.
ఇది చదవండి: ఒక బ్యాడ్ న్యూస్.. రెండు గుడ్ న్యూస్‌లు.! హైదరాబాద్ ఊపిరి పీల్చుకో.. కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు..