Python Tiger Fight: భారీ అనకొండతో పోరాడిన పులి.. హోరా హోరీ పోరు తర్వాత ఏం జరిగిందంటే..

సాధారణంగానే.. ఫారెస్ట్ రిజర్వుల్లో జంతువులు ఫైటింగ్ చేసుకుంటూనే ఉంటాయి. టెక్నాలజీ పుణ్యమా అని.. ఇప్పుడు వాటిని మనం కళ్లారా చూస్తున్నాం. అయితే..

Python Tiger Fight: భారీ అనకొండతో పోరాడిన పులి.. హోరా హోరీ పోరు తర్వాత ఏం జరిగిందంటే..
Tiger Python Video

Updated on: Mar 16, 2021 | 12:19 PM

సాధారణంగానే.. ఫారెస్ట్ రిజర్వుల్లో జంతువులు ఫైటింగ్ చేసుకుంటూనే ఉంటాయి. టెక్నాలజీ పుణ్యమా అని.. ఇప్పుడు వాటిని మనం కళ్లారా చూస్తున్నాం. అయితే.. అలాంటి ఓ యుద్ధమే అడవిలో జరిగింది. అది అలాంటి.. ఇలాంటి యుద్ధం కాదండోయ్. ఒక భారీ పైథాన్‏కు చిరుతకు జరిగిన భయంకర యుద్ధం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక భారీ పైథాన్.. చిరుత రెండు బలమైన ప్రాణులే. అలాంటి భారీ బలమైన ప్రాణులు ఒకదానిటికోకటి పోరుకు దిగితే ఎలా ఉంటుంది. అలాంటి ఘటనే కర్టాటకలోని ఓ అభయారణ్యంలో జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని నాగర్హోల్ అభయారణ్యం వద్ద సఫరీ కోసం వెళ్ళిన పలువురు ఆ భీకర యుద్దాన్ని తమ కెమెరాలలో బంధించారు. ప్రస్తుతం ఈ ఫోటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో ఒక భారీ పైథాన్‌‌ చిరుతపులిని వేటాడేందుకు ప్రయత్నించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన చిరుత పైథాన్ పై ఎదురు దాడికి దిగింది. ఈ రెండింటి మధ్య జరిగిన హోరా హోరీ పోరులో చివరికి చిరుతే గెలిచింది. పైథాన్ ను చంపి.. దానిని చిరుత నోట్లో పెట్టుకోని వస్తుండగా.. అక్కడు పర్యాటకులు దానిని వారి కెమెరాలో బందించారు.

 

Also Read:

టూర్ కోసం ప్లాన్ చేసేవారికి కర్టాటక బెటర్ ఆప్షన్.. అక్కడున్న ఉత్తమ పర్యాటక ప్రదేశాలు..

 

Follow Us