Supernumerary Posts : పోలీస్ శాఖలో సూపర్ న్యూమరీ పోస్టులు.. ఎవరు అర్హులో తెలుసుకోండి..

| Edited By: Team Veegam

Mar 24, 2021 | 12:09 PM

Supernumerary Posts : తెలంగాణ పోలీస్ శాఖలో నాన్-క్యాడర్ ఎస్సీ, డీఎస్పీ పోస్టులను సూపర్ న్యూమరరీ పద్ధతిలో క్రియేట్ చేసేందుకు ప్రభుత్వం

Supernumerary Posts : పోలీస్ శాఖలో సూపర్ న్యూమరీ పోస్టులు.. ఎవరు అర్హులో తెలుసుకోండి..
Supernumerary Posts
Follow us on

Supernumerary Posts : తెలంగాణ పోలీస్ శాఖలో నాన్-క్యాడర్ ఎస్సీ, డీఎస్పీ పోస్టులను సూపర్ న్యూమరీ పద్ధతిలో క్రియేట్ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు జీఓ ఎంఎస్ 39 జారీ చేశారు. నాన్-కేడర్ ఎస్సీ విభాగంలో 26 పోస్టులు, డీఎస్పీ విభాగంలో 122 పోస్టులను క్రియేట్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పోలీస్ శాఖలో ప్రమోషన్ల విషయంపై పలు స్థాయిల్లో కోర్టుల్లో వివాదాలు నడుస్తున్నాయి. ఈ కారణంగా ఆయా పోస్టుల్లో ప్రమోషన్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులకు సూపర్ న్యూమరీ పద్ధతిలో ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించనుంది. రెగ్యులర్ పోస్టుల వరకు మాత్రమే ఈ ప్రమోషన్లు అమల్లో ఉంటాయని జీఓలో స్పష్టం చేశారు.

ఇక తెలంగాణలో త్వరలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల అవుతుందని నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 20 వేలకు పైగా పోలీసు ఉద్యోగ నియమకాలు చేపట్టగా.. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు పోస్టులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. ఆ నివేదికలో రాష్ట్ర వ్యాప్తంగా 425 ఎస్సై పోస్టులు అవసరమని పేర్కొన్నారు.

దీనిలో ఎస్సై సివిల్‌-368, ఏఆర్‌-29, కమ్యూనికేషన్స్‌-18 పోస్టులు ఉన్నాయి. 19,300 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీచేయాలని నివేదికలో తెలిపారు. వీటిలో సివిల్‌-7764, ఏఆర్‌-6683, టీఎస్‌ఎస్‌పీ-3874, కమ్యూనికేషన్స్‌-256, 15వ బెటాలియన్‌లో 561 ఖాళీలు ఇందులో ఉన్నాయి. ఇదిలాఉంటే.. వయోపరిమితి సడలింపుపై నోటిఫికేషన్‌ సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

హీరో నానికి షాక్ ఇచ్చిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు .. జెర్సీ సినిమాకు విషెస్ తెలుపుతూనే ఇలా..

వామ్మో ఈ మూడు పండ్లను అస్సలు తినకండి.. తిన్నారో ఇక అంతే సంగతులు.. అసలు నిజాలు తెలుసుకోండి..

Covid :దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కరాళనృత్యం..మూతపడుతున్న స్కూల్స్.. మాల్స్ రెస్టారెంట్లపై ఆంక్షలు(వీడియో )