Flying Cars: ఎప్పటినుంచో ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎగిరే కార్లకు పర్మిషన్ వచ్చేసింది. త్వరలోనే ఆకాశమంతా ఎగిరేకార్లతో ఫుల్ రష్‌గా కనబడబోతోంది. 10 వేల అడుగుల ఎత్తులో గంటకు వంద మైళ్లు ప్రయాణించే తొలి ఎగిరే కారు టేకాఫ్‌కు అధికారిక క్లియరెన్స్ లభించింది. ఈ మేరకు అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అనుమతులు మంజూరు చేసింది.
టెర్రాఫుజియా ట్రాన్సిషన్ రోడబుల్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు ఎఫ్ఏఏ ప్రత్యేక లైట్-స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికెట్ జారీ చేసింది. విమానానికి ఉండాల్సిన అన్ని ప్రమాణాలు ఈ రోడబుల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఉండడంతో ఈ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే, ప్రస్తుతానికి ఈ ఎగిరే కారుకు రహదారి అనుమతులు రానప్పటికీ త్వరలోనే అవి కూడా వస్తాయని చెబుతున్నారు. ఈ ఎగిరే కారు రెక్కల పొడవు మొత్తం 27 అడుగులు. పైలట్లు, ఫ్లైట్ స్కూళ్ల కోసం ప్రస్తుతం ఇందులో ఫ్లైట్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ తీసుకోవాలనుకునే వారికి డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు పైలట్ సర్టిఫికెట్ కూడా ఉండాలని చైనీస్ కంపెనీ అయిన టెర్రాఫుజియా స్పష్టం చేసింది.
కాగా, ఈ ఎగిరే కారు తయారీలో పాలు పంచుకున్న బృందానికి టెర్రాఫుజియా అభినందనలు తెలిపింది. ఇప్పటికే ఈ ఎగిరే కారు 80 రోజుల ఫ్లైట్ టెస్టింగ్ పూర్తి చేసుకుందని సంస్థ జనరల్ మేనేజర్ కెవిన్ కోల్‌బర్న్ తెలిపారు. ఈ ఎగిరే కారు హైడ్రాలిక్ మోటార్‌పై పనిచేస్తుంది. అలాగే నాలుగు చక్రాల హైడ్రాలిక్ డిస్క్ బ్రేకులు, ఎయిర్‌ఫ్రేమ్ పారాచూట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు 590 కేజీలు. ఇందులో ల్యాండింగ్ గేర్, 27 అడుగుల పొడవున్న రెక్కలను అమర్చారు. ఇది విమాన రూపం నుంచి ఒక్క నిమిషంలో కారుగా మారిపోతుంది.
‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..
ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…
భర్తతో కలిసి ఫేవరెట్ ప్లేస్‌లో కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!