Viral News: దొంగగారి మహా తెలివి.. చూస్తే ఎవ్వరయిన షాక్ అవ్వాల్సిందే.. నెట్టింట్లో వీడియో వైరల్..

ఇప్పటి వరకు మనం చాలా రకాల దొంగతనాలను చూసుంటాం. ఎంతో మంది రకరకాలుగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా ఉంటారు. కొన్ని సందర్భాల్లో దొంగతనం

Viral News: దొంగగారి మహా తెలివి.. చూస్తే ఎవ్వరయిన షాక్ అవ్వాల్సిందే.. నెట్టింట్లో వీడియో వైరల్..

Edited By:

Updated on: Jan 07, 2021 | 7:36 PM

ఇప్పటి వరకు మనం చాలా రకాల దొంగతనాలను చూసుంటాం. ఎంతో మంది రకరకాలుగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా ఉంటారు. కొన్ని సందర్భాల్లో దొంగతనం చేయడానికి వారి తెలివితేటలను చూసి పోలీసులే ఆశ్చర్యపోతుంటారు. సాధరణంగా కనిపిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా దొంగతనం చేసి దర్జాగా వెళ్ళిపోతుంటారు. కానీ సీసీ కెమెరాలు వాళ్ళను చూస్తుంటాయి అని మాత్రం పట్టించుకోరు. తాజాగా ఓ దొంగ చేసిన పనికి అందరు షాక్ అయ్యారు. అతడు చేసిన పని మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

ఆ వీడియోలో ఏం ఉందంటే.. రోడ్డు పక్కన షాపు ముందు ఓ వ్యక్తి కారు ఆపాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ దొంగ నెమ్మదిగా కారు వైపుకు వచ్చాడు. ఆ కారు యజమాని కారు దిగి లాక్ చేస్తుండగా.. ఆ దొంగ ఎంతో తెలివిగా రేర్ డోర్ కొద్దిగా తెరిచి.. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యజమాని కార్ లాక్ చేసి ఎదురుగా ఉన్న బిల్డింగ్‏లో వెళ్ళగానే వెంటనే ఆ దొంగ అక్కడకు వచ్చి చుట్టూ చూసి ఆ కారు లోపలికి వెళ్తాడు. అందులో ఉన్న ల్యాప్‏టాప్ బ్యాగ్, జాకెట్ తీసుకొని ఎంతో దర్జగా మరో పక్కనున్న డోర్ నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోతాడు. ఎవరికి అనుమానం రాకుండా అతడు చేసిన పని మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. గతేడాది డిసెంబర్లో ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‏లోడ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆ దొంగ తెలివి మంచి పనులకు వాడితే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Also Read: ఘరానా దొంగ అరెస్ట్… మూడు కమిషనరేట్ల పరిధిలో 250కి పైగా కేసులు…అనుచరులను అదుపులోకి…

Crime News : దొంగతనం చేసి సినిమా స్టైల్లో కథ అల్లింది..స్క్రీన్ ప్లే అయితే చింపేసింది..పోలీసులు షాక్