Relationship Tips: ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్.. రిలేషన్‌షిప్‌లో ఈ తప్పులు అస్సలు చేయకండి..!

|

Apr 13, 2022 | 6:27 AM

Relationship Tips: ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మొదటి కలయికలో ఏర్పడే అభిప్రాయం చిరస్థాయిగా నిలిచిపోతుందని, అందుకే..

Relationship Tips: ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్.. రిలేషన్‌షిప్‌లో ఈ తప్పులు అస్సలు చేయకండి..!
Relationship
Follow us on

Relationship Tips: ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మొదటి కలయికలో ఏర్పడే అభిప్రాయం చిరస్థాయిగా నిలిచిపోతుందని, అందుకే ఎవరినైనా మొదటిసారి కలిసినప్పుడు తమ పట్ల మంచి దృక్పథం ఏర్పడేలా నడుచుకోవాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా యువతి, యువకుల రిలేషన్‌షిప్ గానీ, ఇతర రిలేషన్‌షిప్ గానీ, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అయి ఉండాలి. లేదంటే.. అసలుకే మోసం వస్తుంది. ఇప్పుడు మనం యువతీ, యువకుల రిలేషన్‌షిప్ గురించి తెలుసుకుందాం. రిలేషన్‌షిప్ కొత్తదైతే.. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి సారి ఎవరితోనైనా డేటింగ్‌కి వెళ్తున్నట్లయితే.. మీ ప్రవర్తన కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి, కొత్త రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసే జంటలు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో వారు చేసిన తప్పు జీవితకాల జ్ఞాపకంగా మారుతుంది. అందుకే మొదటి కలయికలో మంచి అభిప్రాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు మొదటి అభిప్రాయం భవిష్యత్తులో అవతలి వ్యక్తితో మీ సంబంధం ఎలా ఉండబోతుందో కూడా నిర్ణయిస్తుంది. అయితే, కొందరికి చెడు అలవాట్లు ఉంటాయి. అవి ఫస్ట్ మీట్‌లో బ్యాడ్ ఇంప్రెషన్ కలుగజేస్తాయి. ఈ అలవాట్ల వల్ల కొత్త సంబంధంలో ప్రతికూలత రావచ్చు. అలాంటి కొన్ని చెడు అలవాట్ల గురించి ఈ కథనంలో ఇప్పుడు తెలుసుకుందాం..

తప్పుడు మాటలు..
కొంతమందికి సరిగా మాట్లాడటం రాదు. తప్పులు మాట్లాడుతుంటారు. అయినప్పటికీ తమ వైఖరిని ఏమాత్రం మార్చుకోకుండా వ్యవహరిస్తుంటారు. ఈ అలవాటు.. మీరు మొదటిసారి కలిసే వ్యక్తికి ఇబ్బంది కలిగిస్తుంది. మీ మాటలను అర్థం చేసుకోవడానికి ఎదుటివారు ఇబ్బందులు పడుతారు. అందుకే.. వచ్చిన భాషలో సరళంగా, సౌకర్యవంతంగా మాట్లాడి.. ఎదుటివారిని ఆకట్టుకోవాలి.

ఎక్కువ మాట్లాడటం..
కొందరికి అతిగా మాట్లాడటం, తక్కువగా వినడం అనే అలవాటు ఉంటుంది. మీరు మొదటిసారిగా కలవబోయే వ్యక్తి ఎక్కువగా మాట్లాడకపోవడం లేదా ఎక్కువగా వినడం కూడా జరగవచ్చు. కొంతమంది మొదటిసారి కలిసినప్పుడు తమ తమ విషయాలు చెప్పుకుంటూ వెళతారు. అవతలి వ్యక్తికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు. ఈ అలవాటు వల్ల ఒక్కసారిగా ఎదుటి వ్యక్తి మీ మాటలను పట్టించుకోరు. మీరు అవసరమైన మేరకే మాట్లాడాలి. అవతలి వ్యక్తి కూడా వినేలా ఉండాలి.

తినడంలో తప్పుడు..
చాలా మందికి ఎక్కడైనా, ఏ పరిస్థితిలోనైనా మనసుకు నచ్చినట్లు తినే అలవాటు ఉంటుంది. అలాంటి వారు భోజనం చేసేటప్పుడు నోటితో శబ్దం చేయడంతో పాటు టేబుల్‌పై ఉన్న వస్తువులను కూడా డిస్టర్బ్ చేస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తే రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవుతుంది.

Also read:

Viral Video: అయ్యయ్యో.. బిస్కెట్ అయిన యువతి ఫీట్.. ఫుల్లుగా నవ్వుకుంటున్న నెటిజన్లు..!

Travel tips: భారతదేశంలోని 5 అందమైన రైల్వే స్టేషన్‌లు.. మీరూ ఓ లుక్కేయండి..!

Tamil Nadu: మంత్రి రోజా విషయంలో టంగ్ స్లిప్ అయిన తమిళనాడు మంత్రి.. అవాక్కైన ఇతర నేతలు..!