Octopus Video: ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్న ఆక్టోపస్.. వీడియో చూస్తే నిజంగానే షాక్ అవుతారు!

| Edited By: Janardhan Veluru

Nov 25, 2023 | 4:24 PM

ఊసర వెల్లి అంటే తెలుసు కదా.. రంగులు మార్చుతుంది. ఒక్కోసారి ఎవ్వరినైనా తిట్టాలంటే.. ఊసరి వెల్లిలా రంగులు మార్చుతుందని అంటూంటారు. తనను ఎవరు ఎక్కడ చంపేస్తారేమో అని భయంతో ఊసరి వెల్లి తను వెళ్లు ప్రదేశాన్ని బట్టి రంగులు మార్చుకుంటూ.. తనని తాను కాపాడుకుంటుంది. ఇది చాలా మందికి తెలుసిన విషయమే. కానీ ఇక్కడ రంగులు మార్చుతున్న ఆక్టోపస్ ని చూశారా.. ఆక్టోపస్ ఏంటి? రంగులు మార్చడం ఏంటని అవాక్కయ్యారా..

Octopus Video: ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్న ఆక్టోపస్.. వీడియో చూస్తే నిజంగానే షాక్ అవుతారు!
Octopus
Follow us on

ఊసర వెల్లి అంటే తెలుసు కదా.. రంగులు మార్చుతుంది. ఒక్కోసారి ఎవ్వరినైనా తిట్టాలంటే.. ఊసరి వెల్లిలా రంగులు మార్చుతుందని అంటూంటారు. తనను ఎవరు ఎక్కడ చంపేస్తారేమో అని భయంతో ఊసరి వెల్లి తను వెళ్లు ప్రదేశాన్ని బట్టి రంగులు మార్చుకుంటూ.. తనని తాను కాపాడుకుంటుంది. ఇది చాలా మందికి తెలుసిన విషయమే. కానీ ఇక్కడ రంగులు మార్చుతున్న ఆక్టోపస్ ని చూశారా.. ఆక్టోపస్ ఏంటి? రంగులు మార్చడం ఏంటని అవాక్కయ్యారా.. ఇది నిజమే. చూస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో ఒక రేంజ్ లో వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు లేట్.. ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

వివరాల్లోకి వెళ్తే..

ఇబ్రహీం ఎల్ హరిరీ రికార్డ్ చేసిన ఈ వీడియోను @octonation హ్యాండిల్ ద్వారా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియో చూశారంటే నిజంగానే మంత్రముగ్ధులు అవ్వక తప్పదు. ఓ ఆక్టోపస్ దాని చర్మ రంగును చుట్టు పక్కల వాతావరణం, పరిస్థితులకు అనుగుణంగా క్షణక్షణాల్లో మార్చేసుకుంటుంది. వివిధ రాళ్ల రూపాన్ని అప్రయత్నంగా ప్రతిబింబించేలా ఈ జీవి ప్రతిభను ప్రదర్శించింది. ఈ వీడియోతో పక్కన దీనికి సంబంధించిన సమాచారాన్ని @octonation రాసుకొచ్చారు.

క్రోమాటోఫోర్స్ చిన్నవి.. వర్ణ ద్రవ్యం కలిగిన కణాలు, కండరాలు నరాల శ్రేణిచే నియంత్రించబడతాయి. ఈ చిన్న సాగే రంచు సంచులు విస్తరిస్తాయి లేదా కుదించవచ్చు. ఆక్టోపస్ రిలాక్స్ గా ఉన్నప్పుడు తెల్లగా లేదా నలుపు రంగు వంటి రంగులను బహిర్గతం చేస్తుంది. క్రోమాటో ఫోర్ చుట్టూ కండరాలు బిగుసుకున్నప్పుడు గోధుమ, నారింజ, ఎరుపు, పసుపు రంగుల్లోకి మారుతుంది.

ఐదు రోజుల క్రితం షేర్ చేయబడిన వీడియో అయినప్పటికీ.. ఇంకా ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియోకి రెండు లక్షలకు పైగా లైక్ లు వచ్చాయి. అలాగే వేలాది మంది కామెంట్స్ ని కూడా చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో చూస్తే నిజంగానే ఊసర వెల్లి గుర్తుకు రావడం ఖాయం.