Na Potta Na Istam Hotel: కొన్ని హోటల్స్ పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. వింటే చాలు నవ్వు వచ్చేస్తుంది. ఈ పేరే ఏంట్రా బాబు అని అనిపిస్తుంది. ట్రెండ్‌ను ఫాలో అవుతూ.. కాస్తా వెరైటీగా పలు హోటల్ యజమానులు విచిత్రమైన పేర్లు పెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ‘పొట్ట పెంచుదాం’ అనే హోటల్ పేరు నెట్టింట్లో తెగ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు తాజాగా ‘నా పొట్ట నా ఇష్టం’ అనే హోటల్ బాగా ఫేమస్ అవుతోంది. పేరుకు తగ్గట్టుగా ఈ హోటల్‌లో ఫుడ్ భలే టేస్టీగా ఉంటుందని కస్టమర్లు చెబుతున్నారు. ఇక నెటిజన్లు అయితే.. ఈ పేరుతో పలు రకాల ఫన్నీ మీమ్స్ రెడీ చేస్తున్నారు. ఈ హోటల్ రాజమండ్రిలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇలా వెరైటీ పేర్లతో గతంలో కూడా పలు హోటల్స్ ఉన్న సంగతి తెలిసిందే. కాగా, కొబ్బరిల్లు, ఉలవచారు, నాటుకోడి, మాయాబజార్, సుబ్బయ్యగారి హోటల్, బాబాయ్ హోటల్, కోడికూర చిల్లు గారె వంటి పేర్లతో వ్యాపారులు తమ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు.
‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..
ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…
భర్తతో కలిసి ఫేవరెట్ ప్లేస్‌లో కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!