Vastu: ఇంటి ముందు నిమ్మ, మిరపకాయ ఎందుకు కడుతారు.? లాజిక్‌ ఏంటి.?

ఇలాంటి వాటిలో ఇంటి ముందు నిమ్మకాయ, మిరపకాయను కట్టడం. హిందూ కుటుంబాల్లో చాలా మంది ఈ విధానాన్ని పాటిస్తుంటారు. నిమ్మకాయ, మిరపకాయలు దారానికి గుచ్చి ఇంటి ముందు కడుతుంటారు. దిష్టి తగలకుండా, లక్ష్మీదేవీ అనుగ్రహం కలిగేందుకు ఇలా కడుతుంటారని చాలా మంది విశ్వసిస్తుంటారు. అలాగే మరికొందరు విశ్వాసం ఆధారంగా.. నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి వేలాడదీయడం వల్ల...

Vastu: ఇంటి ముందు నిమ్మ, మిరపకాయ ఎందుకు కడుతారు.? లాజిక్‌ ఏంటి.?
Lemon And Mirchi

Updated on: Dec 02, 2023 | 12:00 AM

మనకు తెలిసినా తెలియకపోయినా కొన్నింటిని ఫాలో అవుతుంటాం. పెద్దలను అసునసరించి కొన్ని పద్ధతులను ఫాలో అవుతాం. అయితే పెద్దలు మనకు అలవాటు చేసిన కొన్నింటిని మూఢనమ్మకాలుగా పేరుబడ్డాయి కానీ ప్రతీ దాని వెనకాల ఒక శాస్త్రీయత ఉంటుందని పండితులు చెబుతుంటారు. దిష్టి మొదలు వాస్తు వరకు ప్రతీ దాని వెనకాల ఒక కారణం ఉంటుంది.

ఇలాంటి వాటిలో ఇంటి ముందు నిమ్మకాయ, మిరపకాయను కట్టడం. హిందూ కుటుంబాల్లో చాలా మంది ఈ విధానాన్ని పాటిస్తుంటారు. నిమ్మకాయ, మిరపకాయలు దారానికి గుచ్చి ఇంటి ముందు కడుతుంటారు. దిష్టి తగలకుండా, లక్ష్మీదేవీ అనుగ్రహం కలిగేందుకు ఇలా కడుతుంటారని చాలా మంది విశ్వసిస్తుంటారు. అలాగే మరికొందరు విశ్వాసం ఆధారంగా.. నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి వేలాడదీయడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయని నమ్ముతారు. అయితే దీనివెనకాల కొన్ని సైంటిఫిక్‌ రీజన్స్‌ కూడా ఉన్నాయని మీకు తెలుసా.? ఇంతకీ అవేంటంటే..

* నిమ్మకాయ విటమిన్‌ సికి పెట్టింది పేరని తెలిసిందే అలాగే మిరపకాయలో కూడా ఈ విటమిన్‌ ఉంటుంది. దీంతో దారానికి నిమ్మకాయ, మిరపకాయలను గుచ్చడం వల్ల నిమ్మకాయ రసం నెమ్మదిగా పత్తిద్వారం ద్వారా మిరపకాయలో చేరి ఆవిరి రూపంలో బయటకు వస్తుంది. ఈ ఆవిరి గాలిలో కలిసినప్పుడు శ్వాసకోస ఇబ్బందులు రావని చెబుతుంటారు.

* అలాగే నిమ్మకాయలోని సిట్రస్ యాసిడ్‌ వాసన కారణంగా క్రిములు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుందని చెబుతుంటారు. అలాగే మిరపకాయలోని ఘాటు కూడా పురుగులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.

* ఇక దిష్టికి కూడా నిమ్మకాయ, మిరపకాయతో చెక్‌ పెట్టొచ్చని కొందరు వాస్తు నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయ, మిరపకాయలు అలాంటి చెడు దృష్టిని ఆకర్షిస్తాయని, అందుకే ఇంటి ముందు ఇవి కడితే దిష్టి తగ్గుతుందని చెబుతున్నారు.

* ఇక వాస్తు శాస్తు ప్రకారం.. నిమ్మచెట్టు ఉన్న ఇంట్లో సంతోషం, సౌభాగ్యం వెల్లివిరుస్తుందట. పర్యావరణంలో ప్రసారం అయ్యే నెగిటివ్ ఎనర్జీని తీసుకుని పాజిటివ్ ఎనర్జీ విడుదల చేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కొన్ని వాస్తు శాస్త్రాల్లో పేర్కొన్న అంశాలు, కొందరి అభిప్రాయాల మేరకు అందించనివి మాత్రమే.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..