Viral: తమ్ముడికి చికిత్స కోసం 3 రోజుల్లో రూ. 47 కోట్లు సేకరించి.. చివరకు అదే వ్యాధితో ఆమె అసువులు బాసింది

|

Aug 05, 2022 | 9:56 AM

ఈ అరుదైన జన్యు వ్యాధి ఉంటే.. సరిగ్గా నడవడం కుదరదు, కూర్చోవడం వల్ల కాదు.. మెడ కూడా తిన్నగా ఉండదు. కండరాలు కూడా సహకరించవు. కానీ ఆమె తమ్ముడి చికిత్స కోసం ఎంతో ఆరాటపడింది. చివరకు ఆమె కృషి ఫలించింది. కానీ

Viral: తమ్ముడికి చికిత్స కోసం 3 రోజుల్లో రూ. 47 కోట్లు సేకరించి.. చివరకు అదే వ్యాధితో ఆమె అసువులు బాసింది
సోదరుడు ముహమ్మద్‌తో అఫ్రా
Follow us on

kerala girl afra emotional story:కేరళకు చెందిన 16 ఏళ్ల ఆ టీనేజ్ యువతి ఆఫ్రాకు నాలుగేళ్ల నుంచే  స్పైనల్ మస్క్యూలర్ అట్రఫీ(spinal muscular atrophy ) అరుదైన జన్యు వ్యాధి ఉంది. సరిగ్గా నడవడం కుదరదు, కూర్చోవడం వల్ల కాదు.. మెడ కూడా తిన్నగా ఉండదు. కండరాలు కూడా సహకరించవు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ  ఆ డిసీజ్ ముదురుతూ వచ్చింది. ఆమెకు ట్రీట్మెంట్ అందించేందుకు పేరెంట్స్ ఎంతో వ్యయప్రయాసలకోర్చారు. కానీ పరిస్థితి చేయి దాటిపోయింది. ఈ క్రమంలోనే మరో కుదుపు. ఆ యువతి తమ్ముడు ముహమ్మద్‌కు కూడా 18 నెలల వయస్సులో అదే వ్యాధి ఉన్నట్లు తేలింది. దీంతో తల్లిదండ్రుల మానసిక వేధన అంతా ఇంతా కాదు. ఈ డిసీజ్‌కు జోల్జెన్‌స్మా అనే ఓ మెడిసిన్ ఉంది. దాని ఒక్క డోస్ ధర ఇంచుమించు 17 కోట్ల 50 లక్షలు. దీన్ని USA నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. అది కూడా 2 ఏళ్ల నిండకముందే మెడిసిన్ ఇస్తే ఫలితం కనిపించవచ్చు. తన బాధను తన తమ్ముడు అనుభవించకూడదని ఆఫ్రా చాలా తీవ్రంగా ఆలోచించింది. ఇలాంటి ప్రమాదరక రేర్ డిసీజస్ విషయంలో క్రౌడ్ ఫండింగ్ చేసేందుకు ఇండియన్ గరర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఆ దిశగా ప్రయత్నం చేయగా కొన్ని లక్షలు సమకూరాయి. కానీ అవి సరిపోవు. ఇంకా చాలా కావాలి. ఈ క్రమంలోనే తమ చుట్టాలలోని ఓ వ్యక్తి సాయంతో ఓ వీడియో ఒక వీడియో షూట్ చేసింది. 2021లో తన బాధను చెప్పి.. తన తమ్ముడికి ఆ నరకం చూడకుండా అందరూ సాయపడాలని కోరింది.

ఆ వీడియో నెటిజన్ల మనసులను కదిలించింది. సోషల్ మీడియాలో విసృతంగా వైరల్‌ అయింది. మానవత్వం ఉన్న మనుషులు అందరూ స్పందించారు. ఏకంగా 3 రోజుల్లో 47.68 కోట్ల డబ్బు వచ్చింది. ఇంకా డబ్బు వస్తూనే ఉండటంతో.. మనీ సెండ్ చేయడం ఆపాలని ఆమె కోరారు. సమకూరిన డబ్బుతో ముహమ్మద్‌కు ట్రీట్మెంట్ చేశారు.  మిగిలిన డబ్బును అదే వ్యాధితో సఫర్ అవుతున్న మరో ఇద్దరు చిన్నారుల కోసం ఖర్చు చేశారు. మిగిలిన మొత్తాన్ని అణా పైసతో సహా కేరళ గవర్నమెంట్‌కు ఇచ్చేశారు. అలా ఆఫ్రా యూట్యూబ్‌లో ఫేమస్ అయ్యారు. పలు అకేషన్స్‌కు సంబంధించిన వీడియోలను ఆమె సోషల్ మీడియాలో పెట్టేవారు. ఈ క్రమంలోనే ఆఫ్రా ఆరోగ్యం క్షిణిస్తూ వచ్చింది. గత సోమవారం పరిస్థితి విషమించి ఆమె కన్నుమూసింది. అఫ్రా మరణ వార్త తెలియగానే నెటిజన్లు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. కాగా ప్రజంట్ 2 ఏళ్ల వయసున్న ఆఫ్రా సోదరుడి ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు పేరెంట్స్ తెలిపారు.

కుటుంబంతో ఆఫ్రా(File Photo)

మరిన్ని జాతీయ వార్తల కోసం