గుడ్లగూబ.. దీనికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి. కొంతమంది గుడ్లగూబ కనిపిస్తే శుభ సూచకంగా భావిస్తారు. మరికొంతమంది అశుభకరంగా పరిగణిస్తారు. గుడ్లగూబల్లో రకరకాల జాతులు ఉంటాయి. అలాగే వారి రంగు కూడా రకరకాలుగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల గూడ్లగుబలు ఉన్నాయి.
- ఏ పక్షి తన మెడను 270 డిగ్రీలు తిప్పగలదు?: గుడ్లగూబల శరీర నిర్మాణం అవి తమ మెడను 270 డిగ్రీల వరకు తిప్పగలవు. చాలా సామర్థ్యాలు ఉన్నప్పటికీ గుడ్లగూబ పగటిపూట పెద్దగా చూడలేకపోయినా.. రాత్రిపూట మాత్రం కంటి చూపు బాగా పని చేస్తుంది. గుడ్లగూబ కళ్ళు చాలా పెద్దవి ఉంటాయి.
- భారతదేశంలో ఎన్ని రకాల గుడ్లగూబలు ఉన్నాయి?: భారతదేశంలో దాదాపు 36 రకాల గుడ్లగూబలు కనిపిస్తాయి. ఇందులో రకరకాల జాతులుఉంటాయి. వీటిలో ప్రధానంగా బ్రౌన్ హాక్ గుడ్లగూబ, కాలర్డ్ గుడ్లగూబ, మచ్చల గుడ్లగూబ, రాక్ ఈగిల్ గుడ్లగూబ, మచ్చల ఆముద గుడ్లగూబ, ఆసియన్ బార్డ్ గుడ్లగూబ, బోయర్ గుడ్లగూబ ఉన్నాయి.
- కొమ్ముల గుడ్లగూబ ఎక్కడ కనిపిస్తుంది?: ఇండియన్ డేగ గుడ్లగూబ – రాక్ ఈగిల్-ఔల్ లేదా బెంగాల్ ఈగిల్-ఔల్ అనేది భారత ఉపఖండంలోని పర్వత, రాతి స్క్రబ్ అడవులలో కనిపిస్తుంటాయి. దీనిని కొమ్ముల గూడ్లగుబ అని కూడా అంటారు.
- హిమాలయ ప్రాంతాలలో ఏ జాతి గుడ్లగూబలు కనిపిస్తాయి?: బార్న్ గుడ్లగూబ హిమాలయ ప్రాంతాలలో కనిపిస్తుంది. దీనిని ఇండియన్ బార్న్ ఔల్, వైట్ గుడ్లగూబ అని కూడా పిలుస్తారు. ఇది గుడ్లగూబలో అరుదైన జాతి.
- ఏ గుడ్లగూబ గద్దలా కనిపిస్తుంది?: ఉత్తర హాక్ గుడ్లగూబకు ఈకలు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. మెడ వెనుక భాగం మినహా శరీరంపై ఒక ఆఫ్-వైట్ స్పాటింగ్ నమూనా కలిగి ఉంటుంది. ఇది నలుపు V- ఆకారపు నమూనాను కలిగి ఉంటుంది. ఇది గద్దలా కనిపిస్తుంది.
- ఉత్తర హాక్ గుడ్లగూబ ఆహారం ఏమిటి?: నార్తర్న్ హాక్ గుడ్లగూబ బొడ్డు దిగువ భాగం తెల్లగా ఉంటుంది. ఉత్తర హాక్ గుడ్లగూబలు మాంసాహారులు. ఇవి చిన్న జంతువులు, పక్షులను వేటాడతాయి.
- గుడ్లగూబలో ఎన్ని ఉపజాతులు ఉన్నాయి?: యురేషియన్ ఈగిల్-గుడ్లగూబ: ఇది యూరప్, రష్యా, మధ్య ఆసియాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. కనీసం 12 ఉపజాతులు ఉన్నాయి.
- ప్రపంచంలో ఎన్ని రకాల గుడ్లగూబలు ఉన్నాయి?: ప్రపంచవ్యాప్తంగా సుమారు 250 రకాల గుడ్లగూబలు ఉన్నాయి. వాటిలో 50 జాతులు ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు.
- గుడ్లగూబలు పగటిపూట ఎందుకు కనిపించవు?: పగటి పూట గుడ్లగూబకు కళ్లు కనిపించవు. అందుకే దాని కళ్ళు అస్పష్టంగా కనిపించడంతో పగలు కనిపించదు. గుడ్లగూబ పగటిపూట బయటకు వెళ్లడానికి ఇష్టపడకపోవడానికి ఇదే కారణం. తానూ ఇబ్బందుల పడతాననఏ కారణంగా బయటకు రాదని జంతు నిపుణులు చెబుతున్నారు.
- గుడ్లగూబ రాత్రిపూట ఎలా స్పష్టంగా చూడగలుగుతుంది?: గుడ్లగూబ కళ్లలో రాడ్లు ఉంటాయట. ఇవి పగటి కంటే రాత్రి చూసేలా చేస్తాయని చెబుతుంటారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి