ఈ ట్రిక్స్ ఫాలో అయితే మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టెయ్యొచ్చు.. అవెంటో తెలుసుకుందామా..

ఈ ట్రిక్స్ ఫాలో అయితే మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టెయ్యొచ్చు.. అవెంటో తెలుసుకుందామా..

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. సాధరణంగా ఈ సమస్యలను

Rajitha Chanti

|

Jan 19, 2021 | 9:25 PM

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. సాధరణంగా ఈ సమస్యలను తగ్గించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అలాగే ఎంతో మంది డాక్టర్ల చుట్టూ తిరిగి అలసిపోతుంటారు. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణం యుక్త వయసులో ఉన్నప్పుడు పౌష్టికాహార లోపం. చాలా మంది యుక్తవయసులో ఉన్నప్పుడు సరిగా ఆహారం తీసుకోకపోవడం వలన ఈ సమస్యల భారీన పడుతుంటారు.

అయితే ఈ మోకాళ్ళ నొప్పులను తగ్గించుకోవడానికి రోజూలో ఎక్కువగా నడవాలట. ఇలా చేయడం వలన కీళ్ళకు మంచి పోషణ అందితుంది. అంతేకాకుండా ఎగుడుదిగుడుగా ఉండే నేల మీద నడవకుండా ఉంటే మంచింది. నేలపై రెండు కాళ్ళు మడత వేసుకొని కూర్చోవడం లాంటివి చేయకండి. అలాగే సాధ్యమైనంత వరకు బరువైన వస్తువులు ఎత్తకుండా ఉండండి. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నవారు రోజూ కొంతవరకు నడవాల్సి ఉంటుంది. అలాగే మోకాళ్ళ నొప్పి కలిగి ప్రతీసారి ఎలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోకపోవడమే మంచింది. అలాగే సాధ్యమైనంతవరకు రోజూ వాకింగ్ అలవాటు చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu