Vastu Tips: అప్పుల బాధలు వేధిస్తున్నాయా.? ఈ వాస్తు చిట్కాలు పాటించండి..

ఇక వాస్తు దోషాల కారణంగా కేవలం ఆరోగ్య సంబంధిత సమస్యలే కాకుండా, ఆర్థికపరమైన సమస్యలు కూడా వెంటాడుతాయని వాస్తు పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే కొన్ని దోషాలు ఆర్థికంగా ఎదగకుండా చేస్తాయని, అప్పుల బాధలు వెంటాడేలా చేస్తాయని చెబుతుంటారు. ఇంతకీ అప్పుల బాధలు తగ్గి, ఆర్థికంగా ఎదగాలంటే ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Vastu Tips: అప్పుల బాధలు వేధిస్తున్నాయా.? ఈ వాస్తు చిట్కాలు పాటించండి..
Vastu Tips
Follow us

|

Updated on: Jun 27, 2024 | 4:54 PM

వాస్తు నియమాలను పాటించే వారు మనలో చాలా మంది ఉంటారు. ముఖ్యంగా భారతీయులను, వాస్తును విడదీసి చూడలేని పరిస్థితి ఉంటుంది. అందుకే కేవలం ఇంటి నిర్మాణం మాత్రమే కాకుండా. అద్దె ఇంటి విషయంలో కూడా వాస్తు నియమాలను తప్పక పాటిస్తుంటారు. వాస్తుకు అనుగుణంగా ఉంటేనే అద్దె ఇంట్లోకి వెళ్తుంటారు.

ఇక వాస్తు దోషాల కారణంగా కేవలం ఆరోగ్య సంబంధిత సమస్యలే కాకుండా, ఆర్థికపరమైన సమస్యలు కూడా వెంటాడుతాయని వాస్తు పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే కొన్ని దోషాలు ఆర్థికంగా ఎదగకుండా చేస్తాయని, అప్పుల బాధలు వెంటాడేలా చేస్తాయని చెబుతుంటారు. ఇంతకీ అప్పుల బాధలు తగ్గి, ఆర్థికంగా ఎదగాలంటే ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంట్లో కుళాయిలు లీక్‌ కావడం సర్వసాధారణమైన విషయం. అయితే ఇలా ట్యాప్‌ల నుంచి దీర్ఘకాలంగా నీరు లీక్‌ అవుతుంటే ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ట్యాప్‌లు లీకవ్వడం వల్ల డబ్బు వృథాగా ఖర్చవుతుందని అంటున్నారు. అందుకే నల్లాలు లీక్‌ అవుతుంటే అస్సలు లైట్ తీసుకోకూడదని వెంటనే రిపేర్‌ చేయించాలని సూచిస్తున్నారు.

* ఇక ఇంట్లో ఈశాన్యం దిశకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఈ దిక్కు విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈశాన్యం మూలను వీలైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవాలని అంటున్నారు. అలాగే ఈ దిక్కులో ఎలాంటి బరువైన వస్తువులు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. చెత్త డబ్బాలు అస్సలు పెట్టకూడదు.

* గోడలకు వేసుకునే రంగుల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా వీలైనంత వరకు లైట్ కలర్స్‌ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఇంట్లోని రంగులు మనిషి మానసిక స్థితిపై ప్రభావం చూడపుతుందని అంటున్నారు.

* ఇక ఇంట్లో ఆగ్నేయ దిశ కూడా చాలా కీలకమైంది. ఈ దిశను వెల్త్‌ కార్నర్‌గా పిలుస్తుంటారు. ఈ దిశలో ఏర్పాటు చేసే కొన్ని వస్తువులు సంపదను ఆకర్షిస్తాయని అంటున్నారు. అందుకే ఆగ్నేయంలో మనీ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మేలు జరుగుతుందని, అప్పుల బాధలు తగ్గి.. ఆర్థిక కష్టాలు దూరమవుతాయని సూచిస్తున్నారు.

* వ్యాపారం, వృత్తి పరంగా పురోగతి సాధించాలంటే ఉత్తర దిశపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని నిపుణులు అంటున్నారు. ఈ ప్రాంతం ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో, కెరీర్ లైఫ్‌లో సక్సెస్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఉత్తర దిశలో కిటీకీలు, డోర్‌లు ఉండేలా చూసుకోవాలి. ఈ దిశ నుంచి ఇంట్లోకి వెలుతురు, గాలి వచ్చేలా చూసుకోవాలి.

* ఇక ఇంట్లో ఏర్పాటు చేసుకునే కొన్ని వస్తువులు సంపదను తీసుకొచ్చిన పెడ్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా లాఫింగ్ బుద్ధ, మూడు కాళ్ల కప్ప, తాబేలు వంటి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల మార్పు కనిపిస్తుందని చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..