Vastu Tips: వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా.? ఈ వాస్తు టిప్స్‌ పాటించండి..

వాస్తును ఫాలో అయ్యేవారు చాలా మంది ఉంటారు. భారతీయుల్లో వాస్తుపై ఉన్న విశ్వాసం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తు కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా వ్యాపార సముదాయాల్లో కూడా వాస్తును పాటిస్తుంటారు. వాస్తులో ఏమైనా లోపాలు ఉంటే వ్యాపారంలో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు.

Vastu Tips: వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా.? ఈ వాస్తు టిప్స్‌ పాటించండి..
Vastu At Shop
Follow us

|

Updated on: Jun 24, 2024 | 4:43 PM

వాస్తును ఫాలో అయ్యేవారు చాలా మంది ఉంటారు. భారతీయుల్లో వాస్తుపై ఉన్న విశ్వాసం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తు కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా వ్యాపార సముదాయాల్లో కూడా వాస్తును పాటిస్తుంటారు. వాస్తులో ఏమైనా లోపాలు ఉంటే వ్యాపారంలో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. అయితే కొన్ని రకాల చిట్కాలను పాటించడం ద్వారా వ్యాపారంలో వచ్చే నష్టాలకు చెక్‌ పెట్టొచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ వాస్తు చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వ్యాపార స్థలాల్లో దుకాణం మెయిన్ రోడ్‌ ఎల్లప్పుడూ మధ్యంలో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. షాప్‌ మెయిన్‌ డోర్‌ కార్నర్‌కి బదులుగా మిడిల్‌లో ఉండేలా చూసుకోవడం బెటర్‌. ఒకవేళ ఓపెన్‌ షటర్‌ ఉంటే పర్లేదు కానీ.. డోర్‌ పెట్టుకుంటే మాత్రం మధ్యలో ఉండేలా చూసుకోవాలి.

* ఇక ఏ దుకాణంలో అయినా కచ్చితంగా ఉండే వాటిలో అల్మారాలు లేదా షెల్ఫ్‌లు ఒకటి. వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని సరైన దిశలో పెట్టుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం దుకాణంలో షెల్ఫ్ లేదా అల్మారా ఎల్లప్పుడూ వాయువ్య దిశలో ఉండాలి. ఇలా చేయడం వల్ల మీకు లాభంతోపాటు వ్యాపారంలో కలిసి వస్తుంది.

* వ్యాపార స్థలంలో దేవుడిని ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే దేవుడి స్థానం ఎల్లప్పుడూ ఈశాన్యంలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* దుకాణాల్లో గోడలకు వేసుకునే రంగుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. వీలైనంత వరకు లేత రంగులు వేయాలి. దీనివల్ల సానుకూల వాతావరణం పెరిగి, ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరగకుండా ఉంటుంది.

* వ్యాపార స్థలంలో పాంచజన్య శంఖాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచి జరగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ప్రతీ రోజూ ఈ శంఖాన్ని పూజించడం వల్ల వ్యాపారంలో లాభాలు ఆర్జించచ్చని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
పాపం.! కల్కి సినిమాకొచ్చి.. ఇరుక్కుపోయిన పవన్ కొడుకు.. వీడియో.
పాపం.! కల్కి సినిమాకొచ్చి.. ఇరుక్కుపోయిన పవన్ కొడుకు.. వీడియో.
డే1 కల్కీకి దిమ్మతిరిగే కలెక్షన్స్‌.! | థియేటర్లలో కమల్ భూకంపం..
డే1 కల్కీకి దిమ్మతిరిగే కలెక్షన్స్‌.! | థియేటర్లలో కమల్ భూకంపం..
ఓయమ్మో.! సినిమా అవుట్ పుట్ దిమ్మతిరిగేలా ఉందిగా..
ఓయమ్మో.! సినిమా అవుట్ పుట్ దిమ్మతిరిగేలా ఉందిగా..
నడవలేని స్థితిలో తిరుమలలో కనిపించిన గాన కోకిల సుశీలమ్మ.. వీడియో.
నడవలేని స్థితిలో తిరుమలలో కనిపించిన గాన కోకిల సుశీలమ్మ.. వీడియో.
అభిమానితో అనుచిత ప్రవర్తన.. ధనుష్ పై నెటిజన్స్‌ సీరియస్.!
అభిమానితో అనుచిత ప్రవర్తన.. ధనుష్ పై నెటిజన్స్‌ సీరియస్.!
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త