కృతిశెట్టి.. ఫాలో ఫాలో యూ.! పాప ఫుల్ హ్యాపీ.. ఫొటోస్ వైరల్..

Anil Kumar

27 June 2024

వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యి భారీ విజయాన్ని అందుకుంది హీరోయిన్ కృతిశెట్టి.

టాలీవుడ్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది.

ఈమె తొలి సినిమా ఏకంగా 100కోట్లకు పైగా వసూల్ చెయ్యడంతో.. మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ మంగళూరు బ్యూటీ.

గతకొంత కాలంగా వరస పరాజయాలను చూస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం కోలీవుడ్‌లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఈ మధ్యనే శర్వానంద్ హీరోగా మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన.. ఈ సినిమాకూడా నిరాశే మిగిల్చింది.

సినిమాల్లో సైలెంట్ అయినా ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

అయితే ఇన్‌స్టా గ్రామ్‌లో తన ఫాలోయర్ల సంఖ్య ఎనిమిది మిలియన్లు దాటినందుకు ఆనందం వ్యక్తం చేశారు ఈ బ్యూటీ.

ఈ సందర్భంగా స్పెషల్ ఫోటోషూట్ చేసి.. సోషల్ మీడియాలో కృతి పంచుకున్న ఫొటోస్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.