Vastu tips: బెడ్‌ రూమ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? జాగ్రత్త..

ఇంట్లో ప్రతీ గది వాస్తుకు అనుకూలంగా ఉండాలని పండితులు చెబుతుంటారు. అందుకే ఇంటి పునాది మొదలు, గోడలకు వేసుకునే రంగుల వరకు అన్నీ వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు. ఇక ఇంట్లో వంట గదికి, పూజ గదికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో బెడ్ రూమ్‌కు కూడా ప్రాధాన్యత ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు...

Vastu tips: బెడ్‌ రూమ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? జాగ్రత్త..
Bedroom Vastu
Follow us

|

Updated on: Jun 28, 2024 | 11:06 PM

ఇంట్లో ప్రతీ గది వాస్తుకు అనుకూలంగా ఉండాలని పండితులు చెబుతుంటారు. అందుకే ఇంటి పునాది మొదలు, గోడలకు వేసుకునే రంగుల వరకు అన్నీ వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు. ఇక ఇంట్లో వంట గదికి, పూజ గదికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో బెడ్ రూమ్‌కు కూడా ప్రాధాన్యత ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సంతోషం ఉండాలంటే కచ్చితంగా బెడ్ రూమ్‌ వాస్తు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ బెడ్‌ రూమ్‌ విషయంలో తీసుకోవాల్సిన ఆ వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంట్లో బెడ్ రూమ్‌ ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం దిశలో ఉండకూడదు. ఈశాన్యం అనేది దేవుళ్లకు కేటాయించింది. అందుకే ఈశాన్యంలో అయితే పూజా గది ఉండాలి లేదంటే ఖాళీ స్థలం ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఇక బెడ్ రూమ్‌ ఉండకూడని మరో దిశ ఆగ్నేయం. ఆగ్నేయంలో వంట గది ఉండాలి. ఆగ్నేయం అగ్ని దిశగా చెబుతుంటారు. ఈ దిశలో బెడ్ రూమ్‌ ఉంటే దంపతుల మధ్య గొడవలకు దారి తీస్తుంది. మానసిక అశాంతి ఉంటుంది.

* ఇంట్లో బెడ్‌ రూమ్‌ను నైరుతిలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక పిల్లల బెడ్‌ రూమ్‌ వాయువ్య మూలలో ఉండొచ్చు. ఇంటి యజమాని కచ్చితంగా నైరుతి దిశలో పడుకోవం మంచిది.

* అలాగే బెడ్ రూమ్‌లో ఉండే కిటికీలులు తూర్పు, ఉత్తరం గోడలకు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మానసిక సమస్యలు దరిచేరవు.

* పడుకునేప్పుడు తల దక్షిణం వైపు, పాదాలు ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. అలాగే స్టీల్‌కు బదులుగా వీలైనంత వరకు చెక్కతో చేసిన మంచాన్నే ఉపయోగించాలి.

* ఇక బెడ్‌ రూమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో అద్దం ఉండకూడదు. మరీ ముఖ్యంగా అద్దంలో మంచం పడేలా ఉంటే దంపతుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.

* అలాగే బెడ్‌ రూమ్‌లో ఉండే వాష్‌ రూమ్‌లో మంచం పడకుండా ఉండాలి. ముఖ్యంగా మంచంపై పడుకునే వారి కాళ్లు బాత్‌రూమ్‌లోకి పడకుండా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఇక బెడ్‌రూమ్‌లో లాకర్‌ పెట్టుకునే వారు దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి. దక్షిణం వైపు సంపాదలకు అధిపతి కుబేరుడు ఉంటాడు. ఆ దిశలో లాకర్ పెట్టుకుంటే మీ సంపద కూడా నిలుస్తుంది.

* బెడ్‌ రూమ్‌లో గోడలకు వేసుకునే కలర్స్‌ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బెడ్ రూమ్‌ గోడలకు లైట్ కలర్స్‌ వేసుకోవాలి. దీనిల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గుర్తించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..