ఇంత గ్యాప్ తరువాత సమంత నిజంగానే ఒప్పుకున్నారా.?

Anil Kumar

30 June 2024

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడెప్పుడు సినిమాలు చేస్తుందా అని అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

మాయోసైటిస్ తో బాధపడుతున్న సామ్ దాన్ని నుంచి కోలుకోవడానికి ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.!

ఇక తెలుగులో చివరిగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది.

తన అనారోగ్య కారణాల వల్ల కాస్త గ్యాప్ తీసుకున్న సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అని ఇండస్ట్రీ నుండి టాక్.

మొన్న ఈ మధ్య బాలీవుడ్‌లో అడుగువు వేసిన ఈ ముద్దుగుమ్మ త్వరలో మరో కొత్త వెబ్‌సీరీస్‌లో నటించనున్నారు సమంత.

ఆదిత్యరాయ్‌ కపూర్‌తో కలిసి ఓ వెబ్ సీరీస్‌ చేయడానికి సమంత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు బీ టౌన్ సమాచారం.

పూర్తి యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కనుంది ఈ సీరీస్‌.. కోసం ఇప్పటికే ఆదిత్య, సమంత ప్రాక్టీస్‌ మొదలుపెట్టారట.

దీనికి 'రక్త బీజ్‌' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.. అయితే ఆగస్టులో చిత్రీకరణ మొదలుకానుంది అని తాజా సమాచారం.