Vastu Tips: కెరీర్‌లో వెనకబడుతున్నారా.? ఇంట్లో ఈ మార్పులు చేసుకోండి..

భారతదేశంలో వాస్తుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే కొత్తి ఇల్లు అనే ఆలోచన రాగానే ప్రతీ ఒక్కరూ మొదట చేసే పని వాస్తు పండితులను సంప్రదించడం. వాస్తు ఆధారంగానే ఇంటి స్థలం ఎంపిక మొదలు, ఇంటి నిర్మాణం ప్రారంభిస్తారు. ఇక వాస్తు కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా...

Vastu Tips: కెరీర్‌లో వెనకబడుతున్నారా.? ఇంట్లో ఈ మార్పులు చేసుకోండి..
Vastu Tips
Follow us

|

Updated on: Jun 30, 2024 | 8:26 PM

భారతదేశంలో వాస్తుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే కొత్తి ఇల్లు అనే ఆలోచన రాగానే ప్రతీ ఒక్కరూ మొదట చేసే పని వాస్తు పండితులను సంప్రదించడం. వాస్తు ఆధారంగానే ఇంటి స్థలం ఎంపిక మొదలు, ఇంటి నిర్మాణం ప్రారంభిస్తారు. ఇక వాస్తు కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా. ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా ఉంటుందని పండితులు చెబుతుంటారు. వృత్తిపరంగా ఇబ్బందులు ఎదురైనా, ఆర్థికంగా కష్టాలు పడుతున్నా వాస్తులో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఎంత కష్టపడినా కెరీర్‌లో కొత్త అవకాశాలు రాకుండా గ్రోత్‌ లేకపోయి.. ఇంట్లో ఆనందం దూరమైన ఒక చిన్న వాస్తు చిట్కాను పాటించాలని వాస్తు పండితులు చెబతుఉన్నారు. ఇందుకోసం ఇంటికి ఉత్తరం వైపు చేపల అక్వేరియంను ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. చేపను పాజిటివ్‌ ఎనర్జీకి సూచికగా చెబుతారు. దీని ఏర్పాటుతో ఇంట్లో ఉండే నెగిటివ్‌ ఎనర్జీ దూరమవుతుంది. ఇక అక్వేరియంను ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేసుకుంటే ఆర్థికంగా మెరుగుపడుతారు.

* కొన్ని సార్లు ఎంత కష్టపడి పనిచేసినా ఆర్థికంగా ఎదుగుదల ఉండదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే పోతుంది. కొన్ని సందర్భాల్లో వచ్చే ఆదాయ మార్గాలు సైతం మూతబడతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే తూర్పు లేదా నైరుతి దిశలో ప్రధాన తలుపు వెలుపల ఒక చిన్న ఫౌంటెన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. నీటి ప్రవాహం ఎప్పుడూ ఉండేలా ఈ ఫౌంటెన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి.

* ఇక ఇంట్లో సంతోషం వెల్లివిరియాలన్నా, ఆర్థిక కష్టాలు దూరమవ్వాలన్నా ఇంట్లో దక్షిణం వైపున ఫీనిక్స్‌ పక్షి ఫొటోను ఏర్పాటు చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఫినిక్స్‌ పక్షి అనేది శూన్యం నుంచి కూడా ఎదుగుతుందని చెబుతుంటారు.

* ఇంట్లో స్పటిక కమలాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇంట్లో సంపద వస్తుంది. స్పటిక కమలాన్ని ఇంటికి నైరుతి మూలలో ఉంచాలి. దీనివల్ల ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. ఇది సంపదను ఆకర్షిస్తుంది.

* ఇటీవల ఇంట్లో మొక్కలు పెంచుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మొక్కలను పెంచడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని వాస్తు పండితులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు మొక్కలను నీరు పోయాలని, వాటిని ఎండిపోకుండా చూసుకోవాలని చెబుతున్నారు.

* ఇక ఇంట్లో ఎంతో కీలకమైన ఈశాన్యం మూల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈశాన్యం మూలలో ఎలాంటి చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఎలక్ట్రానిక్స్‌ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌..ధరలు తగ్గనున్నాయా?
ఎలక్ట్రానిక్స్‌ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌..ధరలు తగ్గనున్నాయా?
ఇంట్లో గొడవలకు ఈ వాస్తు తప్పులే కారణం.. వెంటనే చెక్ చేసుకోండి..
ఇంట్లో గొడవలకు ఈ వాస్తు తప్పులే కారణం.. వెంటనే చెక్ చేసుకోండి..
పవన్ నటించిన ఒకే ఒక్క యాడ్.. రెమ్యునరేషన్ ఏంతంటే..
పవన్ నటించిన ఒకే ఒక్క యాడ్.. రెమ్యునరేషన్ ఏంతంటే..
నోట్లో కత్తి.. ముఖం నిండా నెత్తురు.. కాళీ మాతలా ఆర్జీవీ హీరోయిన్
నోట్లో కత్తి.. ముఖం నిండా నెత్తురు.. కాళీ మాతలా ఆర్జీవీ హీరోయిన్
'NEET PG నిర్వహణకు 2 గంటల ముందు మాత్రమే ప్రశ్నాపత్రం సిద్ధం'
'NEET PG నిర్వహణకు 2 గంటల ముందు మాత్రమే ప్రశ్నాపత్రం సిద్ధం'
మీరు ఐటీఆర్‌ ఫైల్‌ చేసిన తర్వాత రీఫండ్‌ రాలేదా? ఇలా చేయండి!
మీరు ఐటీఆర్‌ ఫైల్‌ చేసిన తర్వాత రీఫండ్‌ రాలేదా? ఇలా చేయండి!
సామ్‌సంగ్ నుంచి స్టన్నింగ్ ఫోన్‌.. బడ్జెట్‌ ధరలోనే..
సామ్‌సంగ్ నుంచి స్టన్నింగ్ ఫోన్‌.. బడ్జెట్‌ ధరలోనే..
పక్కా ప్లాన్‌తో వస్తున్న పుష్పరాజ్‌.. పార్టీ గట్టిగానే ప్లాన్
పక్కా ప్లాన్‌తో వస్తున్న పుష్పరాజ్‌.. పార్టీ గట్టిగానే ప్లాన్
ప్రియురాలి కళ్ళల్లో ఆనందం కోసం.. ఎంత పని చేశాడు..!
ప్రియురాలి కళ్ళల్లో ఆనందం కోసం.. ఎంత పని చేశాడు..!
ఘోరం.. ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 23 మంది దుర్మరణం
ఘోరం.. ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 23 మంది దుర్మరణం