ఉల్లి రసంతో జుట్టు సమస్యల మాటే రాదు..
TV9 Telugu
02 July 2024
ఉల్లి రసం, బాదం నూనె మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి మసాజ్ చేసి ఓ అరగంట పాటు గాలిలో ఆరబెట్టుకోవాలి.
ఆ తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మీకు చక్కటి రిజల్ట్ కనిపిస్తుంది.
బాదం నూనెతో జుట్టుకు మెరుపువస్తుంది. అలాగే ఉల్లి రసంతో జట్టును సాఫ్ట్ చేయడంతో పాటు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
ఉల్లి రసం, ఆలీవ్ ఆయిల్ కూడా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఈ మిశ్రమాన్ని తలకు బాగా రాసి, మసాజ్ చేసి ఓ 30 నిమిషాలు అలా వదిలేయండి.
ఆ తర్వాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒక్కసారైనా ఇలా చేస్తే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది.
ఉల్లి రసం, నిమ్మరసం మిశ్రమాన్ని తలకు రాసి, మసాజ్ చేసి ఓ 15 నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత షాంపూతో జుట్టును కడిగేయాలి.
ఈ కాంబినేషన్ జుట్టుకు మంచి కండీషనర్ గా పని చేస్తుంది. దీంతో జుట్టు రాలడంతో పాటు మృదువుగా తయారవుతాయి. చుండ్రు కూడా తగ్గుతుంది.
ఉల్లిపాయ-పెరుగు రెండింటి మిశ్రమాన్ని తలకు రాసి ఓ 45 నిమిషాలు తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి సాఫ్ట్ గా చేసింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి