ఆ డైరెక్టర్ కోసం రూల్స్ పక్కన పెట్టేసిన నయనతార..
TV9 Telugu
30 June 2024
సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయన తార సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది.
ఆఖరుకు తాను నటించిన సినిమాల ప్రచార కార్యక్రమాల్లో కూడా నయన తార పాల్గొనదని అందరికీ తెలుసు.
ఒక సినిమాకు సంతకం పెట్టే సమయంలోనే ప్రమోషన్స్ కార్యక్రమాలకు రానని ముందే స్పష్టంగా చెప్పి రూల్ పెట్టేస్తుంది నయన తార.
ఆఖరుకు చిరంజీవి,షారూఖ్‌ఖాన్ వంటి స్టార్స్‌తో నటించిన నయనతార వారి సినిమా ప్రమోషన్లలోనూ పాల్గొనలేదు
యితే తాజాగా ఒక డైరెక్టర్ కోసం తన రూల్‌ను బ్రేక్ చేసింది నయనతార. అతను మరెవరో కాదు తెలుగులో పవన్ కల్యాణ్ తో 'పంజా' సినిమా దర్శకుడు విష్ణువర్ధన్.
తాజాగా విష్ణువర్ధన్ 'నేసిప్పయ' అనే సినిమా తీశారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంది నయన తార.
దీనికి ఒక ప్రత్యేక కారణముంది. విష్ణువర్ధన్ తమిళ్‌లో బిల్లా సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇందులో హీరోయిన్ నయనతారనే.
బిల్లా సినిమాతో నయన తార కెరీర్ మారిపోయింది. వరుస అవకాశాలతో లేడీ సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగిపోయింది
ఇక్కడ క్లిక్ చేయండి..